Gangster Anil Dujana killed: యూపీలో గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా ఎన్ కౌంటర్
Gangster Anil Dujana killed: ఉత్తర ప్రదేశ్ లో కరడుగట్టిన నేరస్తుడు, 60 కి పైగా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా (Anil Dujana) ను గురువారం పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు.
Gangster Anil Dujana killed: యూపీలో కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా (Anil Dujana) గురువారం పోలీస్ ఎన్ కౌంటర్ (encounter) లో చనిపోయారు. ఆయన వయస్సు 36 ఏళ్లు. మీరట్ సమీపంలోని గ్రామంలో గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతిలో హతమయ్యాడు.
Gangster Anil Dujana killed: ఎన్ కౌంటర్..
ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్స్, నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుని జనాలను భయభ్రాంతులను చేస్తున్నవారిపై యోగి ఆదిత్య నాథ్ () ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మాఫియాకు, క్రిమినల్స్ కు, గ్యాంగ్ స్టర్స్ కు, అవినీతికి యూపీలో స్థానం లేదని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పలుమార్లు ప్రకటించారు. అందులో భాగంగానే, గురువారం వాంటెడ్ క్రిమినల్, దాదాపు 60 కి పైగా హత్యలు, బెదిరింపు వసూళ్లు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా (Anil Dujana) ఎన్ కౌంటర్ (encounter) జరిగింది. ‘‘మీరట్ సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు వాంటెడ్ క్రిమినల్ అనిల్ దుజానాను అరెస్ట్ చేయడానికి వెళ్లిన మా బృందంపై, అనిల్ దుజానా, ఆయన గ్యాంగ్ కాల్పులు జరిపింది. దాంతో, మా టీమ్ జరిపిన ఎదురు కాల్పుల్లో (encounter) అనిల్ దుజానా చనిపోయాడు’’ అని యూపీ ఎస్టీఎఫ్ (STF) అదనపు డైరెక్టర్ జనరల్ (Additional Director-General) అమితాబ్ యశ్ వెల్లడించారు. అనిల్ దుజానా (Anil Dujana) ను ఎదురుకాల్పుల్లో హతమార్చిన ఎస్టీఎఫ్ బృందానికి ఏఎస్పీ (Additional Superintendent of Police) బ్రిజేశ్ సింగ్ నాయకత్వం వహించారు.
Gangster Anil Dujana killed: నోయిడా వాస్తవ్యుడు..
అనిల్ దుజానా (Anil Dujana) నోయిడాలోని గౌతం బుద్ధ నగర్ కు చెందినవాడు. ఆయనపై 60 కి పైగా హత్యలు, బెదిరింపు వసూళ్లు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఎక్కువగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ నేరాలు చేశాడు. ఒక హత్యానేరంపై అరెస్టై, గతవారమే బెయిల్ పై విడుదల అయ్యాడు. విడుదల అయిన రోజు నుంచే ఆ కేసులో కీలక సాక్షిని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాదాపు వారం క్రితమే యూపీలోని రాజకీయ నాయకులుగా మారిన గ్యాంగ్ స్టర్స్ ఆతిఖ్ అహ్మద్ (Atiq Ahmad), అష్రఫ్ అహ్మద్ లను ముగ్గురు వ్యక్తులు పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపేశారు. ఆతిఖ్ కొడుకు, మరో గ్యాంగ్ స్టర్ అసద్ (Asad Ahmad) ను అంతకుముందే పోలీసులు ఎన్ కౌంటర్ (encounter) లో చంపేశారు.
టాపిక్