Gali Janardhana Reddy new party : కొత్త పార్టీని ప్రకటించిన గాలి జనార్ధన్ రెడ్డి
Gali Janardhana Reddy launches new party : గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.
Gali Janardhana Reddy launches new party : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి.. బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పార్టీని ప్రకటించారు. 'కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష' అనే పేరు పెట్టారు. కొత్త పార్టీతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లోకి దిగుతున్నట్టు.. కొప్పల్ జిల్లాలోని గంగవతి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్టు వెల్లడించారు గాలి జనార్ధన్ రెడ్డి.
"నాకు బీజేపీతో రెండు దశాబ్దాల బంధం ఉంది. కానీ ఇప్పుడు నేను పార్టీ సభ్యుడిని కాదని వారు చెబుతున్నారు. పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. కానీ ప్రజలు మాత్రం నేను బీజేపీకే చెందిన వాడినని ఇన్నేళ్లు విశ్వసించారు. వారి నమ్మకాలు నేడు అబద్ధంగా మిగిలిపోయాయి. ఈరోజున నేను కొత్త పార్టీని ప్రకటిస్తున్నా. దాని పేరు కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష. ఇది నా ఆలోచనలు, సామాజిక కార్యకర్త బసవన్న ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. మతం, కులాలను అడ్డుపెట్టుకుని సాగుతున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకం మా పార్టీ," అని గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు.
Gali Janardhana Reddy news : పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల ఆలోచనలను తెలుసుకునేందుకు.. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడతానని స్పష్టం చేశారు గాలి జనార్ధన్ రెడ్డి.
"నా జీవితంలో నేను తీసుకున్న ఏ నిర్ణయంలోనూ ఓడిపోలేదు. చిన్నప్పటి నుంచి నేను ఓటమినే అంగీకరించలేదు. అందుకే.. ఈసారి కళ్యాణ రాజ్య ప్రగతి పక్షతో ప్రజల ముందుకు వెళుతున్నాను. వారి ఆశిస్సులు నాకు లభిస్తాయని నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో కర్ణాటక.. కళ్యాణ రాజ్యంగా ఎదుగుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు," అని గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
Kalyana Rajya Pragati Paksha : "గంగావతిని నా ఇంటిగా చేసుకున్నాను. ఎన్నికల జాబితాలో ఎన్రోల్ చేసుకున్నా. ఇక్కడి నుంచే పోటీ చేస్తాను," అని గాలి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.
గాలి జనార్ధన్ రెడ్డీ.. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి 12ఏళ్లు గడిచిపోయాయి. మైనింగ్ స్కామ్‌లో సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేయడంతో రాజకీయంగా ఆయన వెనకబడ్డారు. అయితే.. 2018 ఎన్నికల నేపథ్యంలో స్నేహితుడు, ప్రస్తుత మంత్రి బీ శ్రీరాముల కోసం మోలాకల్మూర్లో కొన్ని రోజుల పాటు ప్రచారాలు నిర్వహించారు.
Gali Janardhan Reddy Kalyana Rajya Pragati Paksha :సీబీఐ అరెస్ట్ తర్వాత.. 2015లో బెయిల్‌పై బయటకొచ్చారు గాలి జనార్ధన్ రెడ్డి. ఆయనపై అనేక ఆంక్షలు విధిస్తూ.. బెయిల్‌ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సొంత ఊరు బళ్లారిలో అడుగుపెట్టవద్దని స్పష్టం చేసింది. కడప, అనంతపూర్‌లో కూడా పర్యటించవద్దని తెలిపింది. ఫలితంగా గంగావతికి మకాం మార్చారు ఈ మాజీ బీజేపీ నేత.
సీబీఐ అరెస్ట్ తర్వాతి నుంచి గాలి జనార్ధన్ రెడ్డిని దూరం పెడుతూ వచ్చింది బీజేపీ. 2018 ఎన్నికల వేళ.. గాలి జనార్ధన్ రెడ్డి గురించి అడిగిన ప్రశ్నకు.. 'బీజేపీకి ఆయనకు సంబంధం లేదు' అని బదులిచ్చారు కేంద్రమంత్రి అమిత్ షా.
సంబంధిత కథనం