Gail Recruitment 2024 : గెయిల్ ఇండియాలో జాబ్స్.. అప్లై చేసేందుకు డైరెక్ట్ లింక్ ఇదిగో
Gail Recruitment 2024 : గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. సీనియర్ ఇంజనీర్, ఇతర పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. దరఖాస్తు చేసే విధానం ఇక్కడ ఉంది.
గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు గెయిల్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ gailonline.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 261 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నవంబర్ 12, 2024న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 11, 2024న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం చదవండి.
ఖాళీ వివరాలు
సీనియర్ ఇంజనీర్: 98 పోస్టులు
సీనియర్ ఆఫీసర్: 130 పోస్టులు
ఆఫీసర్: 33 పోస్టులు
పైన పేర్కొన్న పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్న విద్యార్హత, వయోపరిమితిని చెక్ చేయాలి. అన్ని అర్హత ప్రమాణాలను (ఆన్‌లైన్ అప్లికేషన్‌లో సమర్పించిన దరఖాస్తు ఆధారంగా) పూర్తి చేసిన అభ్యర్థులు తదుపరి ఎంపిక కోసం మాత్రమే పరిగణిస్తారు. ఎంపిక ప్రక్రియలో సెలక్షన్ కమిటీ ముందు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు ఉంటాయి.
సీనియర్ ఆఫీసర్ (F&S), ఆఫీసర్ (సెక్యూరిటీ), ఆఫీసర్ (అధికారిక భాష) మినహా అన్ని పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో పొందే మార్కుల కనీస అర్హత శాతం UR/OBC(NCL)/EWS వర్గానికి 60 శాతం, SC/ST/PwBD వర్గానికి 55 శాతంగా ఉంది. దీనితోపాటుగా ఇతర అర్హతలను కూడా చూస్తారు.
దరఖాస్తు రుసుము
UR/EWS/OBC (NCL) వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.200, దరఖాస్తు రుసుమును చెల్లించాలి. SC/ ST/PwBD కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పేటీఎం, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.
ఇలా అప్లే చేయాలి
gailonline.comకు వెళ్లండి. పని చేసే ఇమెయిల్, మొబైల్ నంబర్‌తో సహా వ్యక్తిగత వివరాలతో నమోదు చేసుకోండి. ఇమెయిల్‌కు ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది.
లాగిన్ చేయడానికి అందించిన ఆధారాలను ఉపయోగించండి.
సంబంధిత ప్రకటన సంఖ్య, దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్‌ను ఎంచుకోండి.
వ్యక్తిగత, విద్యా, అనుభవం వివరాలను కచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇతర స్టెప్స్ ఫాలో కావాలి.
నమోదు చేసిన మొత్తం సమాచారాన్ని చూడాలి. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.