Gaganyaan mission : గగన్యాన్వైపు తొలి అడుగుకు బ్రేక్- మొదటి ‘టెస్ట్’ వాయిదా..!
Gaganyaan mission latest updates : గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో చేపట్టాల్సిన తొలి 'టెస్ట్' చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటించింది.
Gaganyaan mission latest news : మానవ సహిత అంతరీక్ష ప్రయోగం గగన్‌యాన్ తొలి అడుగుకు బ్రేక్ పడింది! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. శనివారం ఉదయం చేపట్టాల్సిన టీవీ-డీ1 ఫ్లైట్ టెస్ట్ (టెస్ట్ వెహికిల్ డెవలప్మెంట్ ఫ్లైట్ మిషన్) వాయిదా పడింది. చివరి నిమిషంలో సిస్టెమ్ 'హోల్డ్'లోకి వెళ్లడంతో.. శ్రీహరికోట నుంచి జరగాల్సిన రాకెట్ లాంచ్.. సాధ్యం అవ్వలేదు.
"ఈరోజు తలపెట్టిన ప్రయోగం సాధ్యం కాలేదు. ఇంజిన్ ఇగ్నీషన్లో సమస్యలు వచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి. మళ్లీ మీకు అప్డేట్ చేస్తాము. ఈ ఫంక్షన్స్ చేయాల్సిన కంప్యూటర్.. 'హోల్డ్' సిగ్నల్ ఇచ్చింది. సమస్యను సరి చేసుకుని.. లాంచ్‌ని రీషెడ్యూల్ చేస్తాము," అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
వాస్తవానికి శనివారం ఉదయం 8 గంటలకు ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి.. శుక్రవారమే కౌంట్‌డౌన్ మొదలైంది. కాగా.. చివరి నిమిషంలో 8:30 గంటలకు వాయిదా పడింది. అక్కడి నుంచి 8:45 గంటలకు వెళ్లింది. అంతా సరిగ్గా జరుగుతోందన్న సమయంలో.. రాకెట్ లాంచ్ 'హోల్డ్'లోకి వెళ్లిపోయింది. ఫలితంగా.. ఈ రోజు చేపట్టాల్సిన ప్రయోగం సాధ్యం అవ్వలేదు.
అసలేంటి ఈ టెస్ట్..?
ఇస్రో.. ఇప్పటివరకు మనుషులను అంతరిక్షంలోకి పంపించలేదు. గగన్‌యాన్‌తో ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తిచేయాలని భావిస్తోంది. ముగ్గురు సభ్యుల బృందాన్ని.. 400 కి.మీల దూరంలోని భూమి కక్ష దగ్గరకు పంపించి, మూడు రోజుల తర్వాత వారిని బంగాళాఖాతంలో సేఫ్‌గా ల్యాండ్ చేయాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది. ఇది సక్సెస్ అయితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.
అయితే, ఇది అంత సులభమైన విషయం కాదు. మానవ సహిత మిషన్లు చేపట్టే ముందు.. మానవ రహిత ప్రయోగనాలు విజయవంతం అవ్వాలు. ఇందులో భాగంగానే శనివారం.. టీవీ-డీ1 ఫ్లైట్ టెస్ట్ చేపట్టాలని నిర్ణయించింది ఇస్రో. ఇందులో.. కీలకమైన 'క్రూ ఎస్కేప్ సిస్టెమ్'ని పరీక్షించాల్సి ఉంది.
ISRO Gaganyaan mission : ఈ ప్రయోగం చాలా కీలకం. అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే.. రాకెట్లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. దీనిని 'అబార్ట్' మిషన్ అని కూడా పిలుస్తోంది ఇస్రో. మొత్తం రెండు అబార్ట్ మిషన్లు ఉన్నాయి. అంతేకాకుండా.. ఆర్బిట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు.. బంగాళాఖాతంలో సేఫ్ ల్యాండింగ్ చేయగలమా? అన్నది నిర్ణయించడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇవి సక్సెస్ అవ్వడం గగన్‌యాన్ మిషన్‌కు చాలా అవసరం. మరి ఇప్పుడు ఈ ప్రయోగం వాయిదా పడటంతో.. తదుపరి డేట్ ఎప్పుడు ఉంటుంది? అన్నది తెలియాల్సి ఉంది.
ISRO latest news : చంద్రయాన్-3 సక్సెస్‌తో జోరు పెంచిన ఇస్రో.. గగన్‌యాన్ మిషన్కి ముందు.. 3 మానవ రహిత మిషన్స్ సహా 20 కీలక పరీక్షలను చేపట్టనుంది. ఇవి విజయం సాధిస్తే.. గగన్‌యాన్ మిషన్‌ను చేపడుతుంది. ఈ ఘట్టం కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తోంది. అన్ని ప్లాన్ ప్రకారమే జరిగితే.. 2025లో గగన్‌యాన్ మిషన్ చేపడుతుంది ఇస్రో.
సంబంధిత కథనం