Fraud: కస్టమర్ కేర్ నుంచి అంటూ రూ.37లక్షలు దోచేశాడు.. భారీ మోసం!-fraudster impersonates customer care person defrauds rs 37 lakh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Fraudster Impersonates Customer Care Person Defrauds Rs 37 Lakh

Fraud: కస్టమర్ కేర్ నుంచి అంటూ రూ.37లక్షలు దోచేశాడు.. భారీ మోసం!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2022 02:37 PM IST

₹37 lakh Fraud: కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ మోసగాడు.. వృద్ధుడి నుంచి రూ.37లక్షలు దోచేశాడు. అసలు ఈ మోసం ఎలా జరిగిందంటే..

ప్రతీకారాత్మక చిత్రం
ప్రతీకారాత్మక చిత్రం

37 lakh Fraud: ఓ బ్యాంకుకు చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‍ను అంటూ ఓ మోసగాడు ఏకంగా రూ.37లక్షలు దోచేశాడు. 76 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి అకౌంట్లలోని డబ్బులతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా కొల్లగొట్టాడు. కొంత సమయంలోనే ఈ దగా చేశాడు. గురుగ్రామ్‍లో జరిగింది ఈ ఘరానా మోసం.

ట్రెండింగ్ వార్తలు

మోసం జరిగిందిలా..

37 lakh Fraud: న్యూ గురుగ్రామ్‍లో నివాసం ఉంటున్న 76ఏళ్ల హరీశ్ చందర్‌ ఫోన్‍కు ఓ మెసేజ్ వచ్చింది. కొత్త క్రెడిట్ కార్డ్ మీ అడ్రస్‍కు డెలివరీ చేయలేమంటూ అందులో ఉంది. ఆ తర్వాత కాసేపటికే క్రెడిట్ కార్డ్ డెలివరీ అయిందంటూ మరో మెసేజ్ వచ్చింది.

దీంతో కంగారు పడిన హరీశ్ చందర్.. ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఇంటర్నెట్‍లో సెర్చ్ చేశారు. ఆ సమయంలో సెర్చ్ రిజల్ట్స్ లో ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ అంటూ ఓ నంబర్ హైలైట్ అయి కనిపిచింది.

ఇంటర్నెట్‍లో కనిపించిన ఆ నంబర్‌కు హరీశ్ చందర్ కాల్ చేశారు. అయితే ఆ నంబర్ కస్టమర్ కేర్‌ది కాదు. అయినా సరే అవతలి వ్యక్తి తాను కస్టమర్ కేర్ నుంచే మాట్లాడుతున్నానని హరీశ్ చందర్ కు చెప్పాడు. మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

37 lakh Fraud: అడ్రస్ అప్‍డేట్ చేసేందుకు ముందుగా బ్యాంక్ వివరాలన్నీ చెప్పాలని హరీశ్ చందర్‌ను ఆ మోసగాడు అడిగాడు. నిజంగా కస్టమర్ కేర్ అధికారే అనుకొని ఆయన అన్ని వివరాలు చెప్పారు. ఆ తర్వాత హరీశ్ చందర్ ఫోన్‍కు ఆ మోసగాడు ఓ రిమోట్ యాక్సెస్ యాప్ లింక్‍ను పంపి డౌన్‍లోడ్ చేసుకునేలా చేశాడు. ఆ తర్వాత ఫోన్‍ను ఆధీనంలోకి తీసుకొని బ్యాంకు ఖాతాల్లోని డబ్బును, ఎఫ్‍డీలను కూడా ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు.

జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బు

37 lakh Fraud: మోసగాడు.. తనతో ఎలాంటి అనుమానం రాకుండా మాట్లాడడని హరీశ్ చందర్ చెప్పారు. “అతడు నమ్మకం కలిగించే విధంగా మాట్లాడాడు. సెక్యూరిటీ కారణాల కోసం ఈ కాల్‍ను రికార్డ్ చేస్తున్నామని, ఎలాంటి భయం అవసరం లేదన్నాడు. అతడు మోసగాడని నేను గుర్తించలేకపోయాను. నేను జీవితాంతంత కూడబెట్టుకునే డబ్బు పోగొట్టుకున్నాను” అని హరీశ్ చందర్ చెప్పారు.

ఐటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్‍ల కింద కేసు నమోదు చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు.. మోసగాడిని పట్టుకునే పనిలో ఉన్నారు.

WhatsApp channel