Electricity Bill : కరెంటు బిల్లు పేరుతో మోసం.. ముందుజాగ్రత్తగా ఈ వార్త చదివేసేయండి!
Electricity Bill Fraud : విద్యుత్ మీటర్ పేరుతో జరుగుతున్న మోసాలపై పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఒక్క తప్పు వల్ల మోసగాళ్లు.. ప్రజలను మోసం చేస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చింది అంటూ మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు.
డిజిటల్ మోసం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. డిజిటల్ మోసాల నుండి రక్షించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే మోసగాళ్ళు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అనేక విధాలుగా జనాల్లోకి వచ్చి.. బురిడీ కొట్టించి.. డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ కనెక్షన్ తనిఖీ పేరుతో ఘోర మోసం జరుగుతోంది. మీరు అజాగ్రత్తగా ఉంటే మోసగాళ్ళు మిమ్మల్ని మోసం చేయవచ్చు.
హర్యానా పోలీసుకు చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విద్యుత్ కనెక్షన్ తనిఖీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ఈరోజుల్లో కొంతమంది మీ ఇంటికి వచ్చి కరెంటు చెక్ చేసి, ఆపై మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారని వీడియోలో పోలీసు చెబుతున్నారు.
పోలీసు చెప్పిన ప్రకారం, కొంతమంది ఇంటికి వచ్చి విద్యుత్ మీటర్ తనిఖీ చేస్తారు. దీని తర్వాత మీ బిల్లు ఎందుకు తక్కువ వస్తోంది? బహుశా మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని అంటారు. అందుకే తక్కువగా వస్తుందని చెబుతారు. దీంతో మీరు బయపడతారు. పోలీసులను పిలిచి మీపై కేసు నమోదు చేస్తారని అంటారు. దీంతో జనాలు భయపడి మోసగాళ్లు చెప్పినట్టుగా వింటారు.
పోలీస్ కేసు గురించి వినగానే జనం భయపడిపోయి డబ్బులు ఇస్తారు. పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారు. మోసగాళ్లు డబ్బులు కోసం ఎదురు చూసి మిమ్మల్ని మోసగిస్తారు. హర్యానాలో ఓ వ్యక్తి ఇలానే బాగా డబ్బు తీసుకుని పరారీ అయ్యాడు.
తెలుగు రాష్ట్రాల్లో అలాంటి మోసాలు ఇంకా మెుదలుకాలేదు. అయితే భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంటికి వస్తే ముందుగా మీ ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేయండి. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వండి అని పోలీసు చెబుతున్నారు. ముందుగానే ఈ విషయం తెలుసుకుంటే.. మీరు ఈ మోసానికి గురికాకుండా ఉండవచ్చు. మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి.