ఇదేం పాడు పని.. మహారాష్ట్రలో బెంగాల్ మానిటర్ లిజర్డ్ పై అత్యాచారం-four held for raping bengal monitor lizard in maha forest ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Four Held For 'Raping' Bengal Monitor Lizard In Maha Forest

ఇదేం పాడు పని.. మహారాష్ట్రలో బెంగాల్ మానిటర్ లిజర్డ్ పై అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Apr 14, 2022 01:14 PM IST

మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో నలుగురు వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. బెంగాల్ మానిటర్ లిజర్డ్ (Bengal monitor lizard) పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వ్యక్తుల అత్యాచారం
మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వ్యక్తుల అత్యాచారం

జంతువులపై అత్యాచారాలు ఈ మధ్య పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఈ తరహాలోనే మహారాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. బెంగాల్ మానిటర్ లిజర్డ్(Bengal monitor lizard) పై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది రత్నగిరి జిల్లా పరిధిలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ లో జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

సీసీ పుటేజీతో…

నిందితులు సహిదరి టైగర్ రిజర్వ్‌ లోకి అటవీ అధికారుల కళ్లుగప్పి ప్రవేశించారు. అక్కడ వారికి కనిపించిన  బెంగాల్ మానిటర్ లిజర్డ్(Bengal monitor lizard) పై అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నలుగురు వ్యక్తులు అక్రమంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు తెలుసుకున్న అధికారులు... వీరిని అదుపులోకి తీసుకున్నారు .వీరిని సందీప్ తుక్రామ్, పవార్ మంగేష్, అక్షయ్ కమ్టేకర్, రమేశ్ గాగ్ గా గుర్తించారు

ఇలా బయటపడింది...

అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించే క్రమంలో వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరి చేసిన దారుణం బయటపడింది. బెంగాల్ మానిటర్ లిజర్డ్ పై అత్యాచారం చేయటాన్ని రికార్డు చేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. వీరికి బెయిల్ మంజూరైంది.అయితే కేసు విచారణలో భాగంగా ప్రతి సోమవారం స్థానిక ఫారెస్ట్ అధికారి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫిల్డ్ డైరెక్టర్ నానాసాహెబ్ చెప్పారు.

ఈ బెంగాల్ మానిటర్ లిజర్డ్స్  ఆసియా ఖండంలోని పలు ప్రాంతాల్లో జీవిస్తోంది. ఇవి 61 నుంచి 175 సెం.మీ పొడవు ఉంటాయి. శరీరం చివర్లో తోక ఉంటుంది. వీటి జీవనం ఎక్కువగా వృక్షాలతో ముడిపడి ఉంటుంది. ఇవీ కీటకాలు, చిన్న చిన్న పక్షులు, గుడ్లు, చేపల పిల్లలను ఆహారంగా తీసుకుంటాయి. కొందరూ వీటిని వేటాడుతూ ఆహారంగా తీసుకుంటారు.

IPL_Entry_Point

టాపిక్