Imran Khan: జైలు నుంచే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవి కోసం పోటీ పడుతున్న ఇమ్రాన్ ఖాన్-former pakiatan pm imran khan to run for oxford university chancellor post ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imran Khan: జైలు నుంచే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవి కోసం పోటీ పడుతున్న ఇమ్రాన్ ఖాన్

Imran Khan: జైలు నుంచే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవి కోసం పోటీ పడుతున్న ఇమ్రాన్ ఖాన్

HT Telugu Desk HT Telugu
Jul 26, 2024 08:14 PM IST

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పలు అవినీతి కేసుల్లో అడియాలా జైలులో ఉన్నారు. ఆక్స్ ఫర్డ్ ఛాన్సలర్ పదవి కోసం యూకే మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ కూడా పోటీ పడుతున్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీ
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీ (ANI)

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవి కోసం పోటీ పడుతున్నారని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు సయ్యద్ జుల్ఫీ బుఖారీ పాకిస్తాన్ కు చెందిన జియో న్యూస్ కు తెలిపారు.

ఆక్స్ ఫర్డ్ పూర్వ విద్యార్థి

ఆక్స్ ఫర్డ్ ఛాన్సలర్ పదవికి 80 ఏళ్ల లార్డ్ ప్యాటెన్ ఇటీవల రాజీనామా చేశారు. ఆ పదవిలో ఆయన 21 ఏళ్ల పాటు ఉన్నారు. ప్యాటెన్ రాజీనామాతో ఆక్స్ ఫర్డ్ ఛాన్సలర్ పదవి ఖాళీ అయిందని, ఇప్పుడు ఆ పదవికి ఇమ్రాన్ పోటీ పడుతున్నారని బుఖారీ గురువారం పాకిస్థాన్ కు చెందిన మీడియా సంస్థ జియో న్యూస్ కు తెలిపారు. ఆక్స్ ఫర్డ్ పూర్వ విద్యార్థి అయిన ఖాన్ గత ఏడాది పాకిస్తాన్ లో జరిగిన ఎన్నికల తర్వాత పలు అవినీతి, హింసను ప్రేరేపించిన కేసుల్లో ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్నారు.

యూకే మాజీ ప్రధానులతో పోటీ

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University) ఛాన్సలర్ రేసులో యూకే మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ లతో ఇమ్రాన్ ఖాన్ పోటీ పడ్తున్నారు. ఖాన్ 1972 లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లోని కెబ్లే కళాశాలలో ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ చదివారు. యూనివర్శిటీ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అతను 1971 లో పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ (cricket) జట్టుకు అరంగేట్రం చేశాడు. 2005 నుండి 2014 వరకు బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా పనిచేశారు. ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ దృష్ట్యా ఆక్స్ ఫర్డ్ ఛాన్సలర్ పదవిని సునాయాసంగా గెలుచుకోగలరని బుఖారీ జియో న్యూస్ తో చెప్పారు.

త్వరలో ప్రచారం ప్రారంభం

ఇమ్రాన్ ఖాన్ నుంచి అనుమతి రాగానే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తామని, ఇందుకోసం సంతకాల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఈ పదవికి అత్యంత అనువైన వ్యక్తి అని, ఆయన పోటీలో విజయం సాధిస్తారని బుఖారీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ (Imran khan) అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, ఆయన అనుమతి ఇవ్వగానే ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి పోటీ

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ యూనివర్సిటీలో ముఖ్యమైన కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తారు. సాధారణంగా, ఛాన్సలర్ ను విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు (గౌరవ డిగ్రీ కాకుండా), స౦ఘ సభ్యులు, పదవీ విరమణ సమయంలో స౦ఘ సభ్యులుగా ఉన్న విశ్రాంత సిబ్బంది ఎన్నుకుంటారని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వెబ్సైట్ పేర్కొంది.

Whats_app_banner