UP news : ఆసుపత్రిలో వసతులు లేక మాజీ ఎంపీ కుమారుడు మృతి! ఇక సాధారణ పౌరుడి పరిస్థితేంటి?-former bjp mps son dies at lucknow hospital due to lack of facilities ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Former Bjp Mp's Son Dies At Lucknow Hospital Due To Lack Of Facilities

UP news : ఆసుపత్రిలో వసతులు లేక మాజీ ఎంపీ కుమారుడు మృతి! ఇక సాధారణ పౌరుడి పరిస్థితేంటి?

Sharath Chitturi HT Telugu
Oct 31, 2023 06:13 AM IST

UP news : యూపీలో మాజీ ఎంపీ ప్రసాద్​ మిశ్రా కుమారుడి మరణ వార్త సంచలనంగా మారింది. ఆసుపత్రిలో బెడ్లు లేక, చికిత్స అందకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు!

ఆసుపత్రిలో వసతులు లేక మాజీ ఎంపీ కుమారుడు మృతి!
ఆసుపత్రిలో వసతులు లేక మాజీ ఎంపీ కుమారుడు మృతి!

UP news latest : ఉత్తర్​ ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల్లో బెడ్లు లేకపోవడంతో, చికిత్స అందక మాజీ బీజేపీ ఎంపీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. రాజకీయ నేతల కుటుంబానికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. ఇక సాధారణ పౌరుడి మాటేంటని.. అందరు విస్మయానికి గురవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

భైరన్​ ప్రసాద్​ మిశ్రా.. బండా నియోజకవర్గం నుంచి గతంలో పార్లమెంట్​కు ప్రాతినిథ్యం వహించారు. కాగా.. ఆయనకు ప్రకాశ్​ మిశ్రా అనే కుమారుడు ఉన్నాడు. ఆతని వయస్సు 41ఏళ్లు. అతనికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయి.

కాగా.. ఆదివారం రాత్రి సమస్య తీవ్రం అవ్వడంతో.. ప్రకాశ్​ మిశ్రాని, 11 గంటల ప్రాంతంలో లక్నోలోని ఎస్​జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. కానీ.. ఎమర్జెన్సీ వార్డు​లో బెడ్లు లేకపోవడంతో, ప్రకాశ్​ మిశ్రాకు సరైన సమయంలో చికిత్స అందలేదు. చివరికి.. అతను ప్రాణాలు కోల్పోయాడు.

Bhairon Prasad Mishra : కుమారుడి మరణంతో విలవిలలాడిన ప్రసాద్​ మిశ్రా.. ఆసుపత్రిలోనే నిరసనకు దిగారు. కుమారుడి మృతదేహంతో ఆసుపత్రి మధ్యలో కూర్చుని నిరసన చేపట్టారు. హాస్పిటల్​ సిబ్బంది వచ్చి.. సంబంధిత డాక్టర్​ని సస్పెండ్​ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిన తర్వాతే.. ఆయన తన నిరసనను విరమించుకున్నారు.

"నేను నా కుమారుడిని కోల్పోయాను. కానీ ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా డ్యూటీ చేయాలనే నిరసనకు దిగాను. నేను నిరసన చేస్తున్నప్పుడు.. చాలా మంది వచ్చి, ఆ డాక్టర్​కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలి," అని ప్రసాద్​ మిశ్రా తెలిపారు.

Bhairon Prasad Mishra son death : బెడ్లు లేకపోవడంతో చికిత్స అందక మాజీ బీజేపీ ఎంపీ కుమారుడు మృతిచెందిన ఘటనపై ఆసుపత్రి సిబ్బంది ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

"రోగిని ఐసీయూకు తీసుకెళ్లాలని డాక్టర్​ చెప్పాడు. కానీ ఐసీయూలో బెడ్లు అందుబాటులో లేవు. ఇలా ఎందుకు జరిగిందే తెలియదు. కమిటీని ఏర్పాటు చేశాము. కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికైతే.. ఆ డాక్టర్​ని సస్పెండ్​ చేశాము," అని ఆసుపత్రి చీఫ్​ డా. ఆర్​కే ధిమన్​ తెలిపారు.

రాజకీయ దుమారం..

ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వంపై ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ మండిపడ్డారు.

UP latest news : "ఇది ఆసుపత్రి వైఫల్యం కాదు. ఇది సీఎం యోగి ఆదిత్యనాథ్​ వైఫల్యం. ఆసుపత్రులకు బడ్జెట్​ ఎందుకు కేటాయించడం లేదు?" అని ప్రశ్నించారు అఖిలేశ్​ యాదవ్​.

కాగా.. ప్రసాద్​ మిశ్రా ఇంటికి వెళ్లి, ఆయన్ని పరామర్శించారు ఉత్తర్​ ప్రదేశ్​ డిప్యూటీ సీఎం ప్రసాద్​ మౌర్య. కమిటీ వేసినట్టు, విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం