Fire accident : ఇంట్లో అగ్నిప్రమాదం.. 21మంది మృతి!-fire at gaza home kills 21 including 7 children report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Fire At Gaza Home Kills 21, Including 7 Children, Report

Fire accident : ఇంట్లో అగ్నిప్రమాదం.. 21మంది మృతి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 06:49 AM IST

Gaza fire accident : ఓ ఇంట్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 21మంది మృతిచెందారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర ఘటన గాజాలో జరిగింది.

అగ్నిప్రమాదానికి గురైన ఇంటి పరిస్థితి...
అగ్నిప్రమాదానికి గురైన ఇంటి పరిస్థితి... (AFP)

Gaza fire accident : ఉద్రిక్తతలతో నిత్యం వార్తల్లో నిలిచే గాజాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాజాకు ఉత్తరాన ఉన్న జబాలియా ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి.. 21మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరికొందరు గాయపడినట్టు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే.. ప్రమాదానికి గురైన ఇంట్లో.. అనేక లీటర్ల ఇంధనాన్ని నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం ధాటికి.. ఇంట్లో గోడలు మసిగా మారిపోయాయి. దట్టమైన పొగ ఆ ఇంటని అలుముకుంది.

ఇదొక దిగ్భ్రాంతికర ఘటన అని పాలస్థీనా అధ్యక్షుడు మహముద్​ అబ్బాస్​ అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఇంట్లో అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో.. శుక్రువారం సంతాప దినంగా ప్రకటించారు. క్షతగాత్రుల కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. వారి బాధను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అబ్బాస్​ ప్రతినిధి నబిల్​ అబు.. ఓ ప్రకటన విడుదల చేశారు.

Gaza fire accident death toll : ప్రమాదానికి గురైన ఇల్లు.. ఓ మల్టీ స్టోరే బిల్డింగ్​లో ఉన్నట్టు తెలుస్తోంది. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో.. ఆ ప్రాంతానికి వందలాది మంది స్థానికులు చేరుకుని అక్కడ గుమిగూడినట్టు సమాచారం. అదే సమయంలో భారీ సంఖ్యలో పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.

జబాలియా అనేది ఓ నిరాశ్రయుల శిబిరం. ఈ ప్రాంతంలో.. చాలా మంది భవనాలు కట్టుకుని ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్నారు.

గాజా స్ట్రిప్​లో 2.3మిలియన్​ మంది పౌరులు ఉంటారు. 2007 నుంచి ఈ ప్రాంతం ఇజ్రాయెల్​ దిగ్భంధంలోనే ఉంటోంది. సాయుధ దళాల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడం కోసమే.. గాజాను దిగ్భందించామని ఇజ్రాయెల్​ చెబుతోంది.

Gaza fire : గాజాలోని సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా.. వంట, వెలుతురు కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటారు గాజావాసులు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక శీతాకాలంలో పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. చలి నుంచి రక్షణ కోసం.. ప్రజలు ఇళ్లల్లో బొగ్గును కాల్చుకుంటారు.

గాజాలో ఈ ఏడాది.. రోజుకు సగటున 12 గంటల విద్యుత్​ సరఫరా అందింది. ఐదేళ్ల క్రితం ఈ సగటు.. 7 గంటలుగా ఉండేదని యూనైటెడ్​ నేషన్స్​ డేటా చెబుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్