Final electoral roll of JK released: జమ్మూకశ్మీర్ ఓటర్ల సంఖ్య 83.5 లక్షలు-final electoral roll of jammu and kashmir released 7 72 lakh voters added ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Final Electoral Roll Of Jammu And Kashmir Released, 7.72 Lakh Voters Added

Final electoral roll of JK released: జమ్మూకశ్మీర్ ఓటర్ల సంఖ్య 83.5 లక్షలు

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 11:48 PM IST

Final electoral roll of JK released: జమ్మూకశ్మీర్ ఓటర్ల తుది జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం సుమారు 83.5 లక్షల మంది ఓటర్లున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Final electoral roll of JK released: సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం 83,59,771 మంది ఓటర్లున్నారు. వారిలో 42,91,687 మంది పురుషులు కాగా, 40,67,900 మంది స్త్రీలు. ట్రాన్స్ జెండర్ల సంఖ్య 184.

ట్రెండింగ్ వార్తలు

Abrogation of article 370: ఎన్నికల నిర్వహణ

2019లో జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విభజించింది. అలాేగే, జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. నూతనంగా ఓటర్ల జాబితాను రూపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా, ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్ ఓటర్ల తుది జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఈ ఓటర్ల జాబితా సిద్ధమైనందున, ఇక జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.

Final voter list of JK: 10 శాతం పెరిగిన ఓటర్లు

ముసాయిదా జాబితాను రూపొందించిన తరువాత, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునే వారికోసం ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించారు. ఆ డ్రైవ్ లో రికార్డు స్థాయిలో 7.72 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడం విశేషం. ముసాయిదా ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు 10% అధికం. అలాగే, గతంలో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్లకు 921 మంది మహిళా ఓటర్లుండగా, సవరించిన జాబితాలో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళా ఓటర్లుండడం విశేషం. అంటే కొత్తగా చేరిన వారిలో మహిళా ఓటర్ల సంఖ్యనే అధికమని తెలుస్తుంది. అలాగే, ఈ స్పెషల్ డ్రైవ్ సమయంలో ఓటరు నమోదు కోసం రికార్డు స్థాయిలో 11 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

Congress objection: కాంగ్రెస్ అభ్యంతరం

ఓటర్ల కొత్త జాబితాపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బయటి వ్యక్తులను, ఇక్కడ ఓటర్లుగా చేరడానికి అర్హత లేనివారిని తుది జాబితాలో చేర్చారని ఆరోపించింది. కొత్త ఓటర్ల సంఖ్య ఈ స్థాయిలో పెరగడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ కొత్త ఓటర్ల గురించి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుపుతామని వెల్లడించింది.

IPL_Entry_Point