Greece train crash : రెండు రైళ్లు ఢీ.. 16మంది దుర్మరణం!-fiery train crash in greece kills 16 hurts at least 85 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Fiery Train Crash In Greece Kills 16, Hurts At Least 85

Greece train crash : రెండు రైళ్లు ఢీ.. 16మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Mar 01, 2023 07:44 AM IST

Greece train crash today : గ్రీస్​ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16మంది ప్రాణాలు కోల్పోయారు.

ఘోర రైలు ప్రమాదం.. 16మంది దుర్మరణం
ఘోర రైలు ప్రమాదం.. 16మంది దుర్మరణం (REUTERS)

Greece train crash today : ఘోర రైలు ప్రమాదంతో గ్రీస్​ దేశం ఉలిక్కిపడింది. ఓ ప్యాసింజర్​ రైలు, మరో గూడ్స్​ ట్రైన్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 16మంది మరణించారు. మరో 85మంది గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

పట్టాలు తప్పిన బోగీలు.. చెలరేగిన మంటలు!

గ్రీస్​లోని అథెన్స్​కు 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

Greece train crash : ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. 85మందిని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. మరో 250మందిని బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేశారు అధికారులు.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఘటనాస్థలంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. "చాలా భయమేసింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ప్రజలందరు అరవడం మొదలుపెట్టారు," అని ప్రయాణికుడు మీడియాకు వివరించాడు. 'భూకంపం సంభవించినట్టు అనిపించింది,' అని మరో ప్రయాణికుడు చెప్పాడు.

రంగంలోకి సైన్యం..

Greece train crash death toll : సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది గ్రీస్​ ప్రభుత్వం. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్​ రైలు.. అథెన్స్​ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం ధాటికి ప్యాసింజర్​ రైలు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు భారీ క్రేన్​ వంటి పరికరాలను రప్పిస్తున్నారు.

IPL_Entry_Point