Pune rape case : 13ఏళ్ల బాలికపై తండ్రి, మామ, సోదరుడు అత్యాచారం- ఏడాదిగా..!-father uncle cousin held for repeatedly raping 13 year old pune girl ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pune Rape Case : 13ఏళ్ల బాలికపై తండ్రి, మామ, సోదరుడు అత్యాచారం- ఏడాదిగా..!

Pune rape case : 13ఏళ్ల బాలికపై తండ్రి, మామ, సోదరుడు అత్యాచారం- ఏడాదిగా..!

Sharath Chitturi HT Telugu
Jun 24, 2024 02:40 PM IST

Pune rape case : ఓ బాలికపై తండ్రి, మామ, సోదరుడు వరుసైన బంధువు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పూణెలో జరిగింది.

బాలికపై తండ్రి, మామ, సోదరుడు రేప్​!
బాలికపై తండ్రి, మామ, సోదరుడు రేప్​!

Pune rape case : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 13ఏళ్ల బాలికపై కుటుంబసభ్యులు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు! స్కూల్​ నిర్వహించిన 'గుడ్​ టచ్​- బ్యాడ్​ టచ్​' సెషన్​తో ఈ విషయం బయటపడింది.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర పూణెలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బాలికకు సోదరుడి వరుస అయ్యే సమీప బంధువు.. 2023 జులైలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఆమె ఎవరికీ చెప్పలేదు.

2024 జనవరిలో.. బాలిక మామ, ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించింది. కోపంతో ఆమెను చాలాసార్లు కొట్టాడు ఆ వ్యక్తి.

వీటన్నింటికీ మించి.. బాధితురాలిపై ఆమె తండ్రి కూడా పదేపదే అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పడం ఆందోళనకర విషయం.

భయంతో ఈ విషయాలను బాలిక బయటకు చెప్పుకోలేకపోయింది.

Father raped daughter in Pune : కాగా.. ఇటీవలే.. ఆమె స్కూల్​లో 'గుడ్​ టచ్​- బ్యాడ్​ టచ్​' సెషన్​ నిర్వహించారు. రెండింటికీ మధ్య వత్యాసాన్ని కౌన్సిలింగ్​ ద్వారా వివరిస్తుండగా.. బాధితురాలు అసలు విషయాన్ని బయటకు చెప్పింది. స్కూల్​ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేశారు. బాలిక తండ్రి, మామ వయస్సు 40కన్నా ఎక్కువ ఉంటుందని, సోదరుడి వరుస అయ్యే బంధువు వయస్సు 20 దాటిందని పోలీసులు వివరించారు.

నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

మరోవైపు ఈ ఘటన పూణెలో కలకలం సృష్టించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని సర్వత్రా డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి;- Bomb scare : విమానంలో బాంబు ఉందని.. ‘సరదాగా’ ఈ-మెయిల్​ పంపిన 13ఏళ్ల బాలుడు!

8ఏళ్ల బాలికను చంపి..!

UP rape case : దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా బాలికలపై రేప్​ ఘటనలు ఆందోళనకరంగా మారాయి. ఓ 8ఏళ్ల బాలికపై ఆమె బంధువు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో కలకలం సృష్టించింది. ఆమె ప్రతిఘటించి, గట్టిగా అరవడంతో.. కోపంలో ఆమెను ఆ వ్యక్తి చంపేశాడు!

యూపీలోని హర్దోయి ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఈ నెల 19న.. ఆకులతో కప్పి ఉన్న బాలిక మృతదేహం, ఓ చెరకు తోటలో కనిపించింది. గ్రామంలోని ఓ యువకుడిపై బాధితురాలి తండ్రి పోలసులకు ఫిర్యాదు చేశాడు.

8 year old girl raped in Uttar Pradesh : ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా.. బాధితురాలి మామ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని విచారించగా.. అసలు విషయం బయటపడింది.

మద్యంలో తాను బాలికను రేప్​ చేసేందుకు ప్రయత్నించినట్టు, కానీ ఆమె గట్టిగా అరవడంతో గొంతు నులిమి చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు నిందితుడు.

బాలికను చంపిన నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అనంతరం అక్కడి నుంచి జైలుకు తరలించారు.

WhatsApp channel

సంబంధిత కథనం