BTech in Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో బీ టెక్ చేయాలనుకుంటున్నారా?.. ఇది చదవండి..
BTech in Delhi University: దేశ రాజధాని లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఇటీవల బీ టెక్ ప్రొగ్రామ్ ను కూడా ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరానికి ఢిల్లీ యూనివర్సిటీలో బీ టెక్ ప్రొగ్రామ్ కు అడ్మిషన్లు ఈ నెలాఖరుకు ప్రారంభమవుతాయి.
BTech in Delhi University: దేశ రాజధాని లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఇటీవల బీ టెక్ ప్రొగ్రామ్ ను కూడా ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరానికి ఢిల్లీ యూనివర్సిటీలో బీ టెక్ ప్రొగ్రామ్ కు అడ్మిషన్లు ఈ నెలాఖరుకు ప్రారంభమవుతాయి. జేఈఈ మెయిన్స్ (JEE Mains) లో సాధించిన స్కోర్ ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయి.
BTech in Delhi University: 2023 -24 విద్యా సంవత్సరం నుంచి..
ఢిల్లీ యూనివర్సిటీ లో 2023 -24 విద్యా సంవత్సరం నుంచి బీ టెక్ కోర్సు ప్రారంభమవుతోంది. మొత్తం మూడు బీ టెక్ కోర్సులను ఇక్కడ ప్రారంభిస్తున్నారు. అవి బీ టెక్ - కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (B.Tech Computer Science and Engineering), బీ టెక్ - ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (B.Tech Electronics and Communication Engineering), బీ టెక్ - ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (B.Tech Electrical Engineering) కోర్సులు. వీటిలో ఒక్కో విభాగంలో 120 సీట్లు ఉంటాయి.
Admissions based on JEE Mains score: జేఈఈ మెయిన్స్ మార్క్స్ ఆధారంగా..
ఢిల్లీ యూనివర్సిటీలోని బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్లను జేఈఈ (Joint Entrance Examination JEE) లో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి క్లాస్ 12 పాస్ అయి ఉండాలి. వారికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ లో కనీసం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. వారి సిలబస్ లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండి ఉండాలి. ఈ అర్హతలతో పాటు జేఈఈ మెయిన్స్ (JEE Mains) లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఢిల్లీ యూనివర్సిటీలో బీటెక్ కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది.