ప్రతి 11 నిమిషాలకో 'శ్రద్ధ' హత్య.. ప్రేమించిన వారే గొంతు కోస్తున్నారు!-every 11 minutes a woman or girl is killed by an intimate partner or family member un chief ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Every 11 Minutes, A Woman Or Girl Is Killed By An Intimate Partner Or Family Member: Un Chief

ప్రతి 11 నిమిషాలకో 'శ్రద్ధ' హత్య.. ప్రేమించిన వారే గొంతు కోస్తున్నారు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 22, 2022 01:29 PM IST

International Day for the 'Elimination of Violence against Women' : యూఎన్​ చీఫ్​ గుటేర్రస్​.. మహిళల హక్కులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో.. ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ/బాలిక.. భాగస్వామి లేదీ కుటుంబ సభ్యుల చేతుల్లో హత్యకు గురవుతోందన్నారు.

ప్రతి 11 నిమిషాలకో 'శ్రద్ధ' హత్య.. ప్రేమించిన వారే గొంతు కోస్తున్నారు!
ప్రతి 11 నిమిషాలకో 'శ్రద్ధ' హత్య.. ప్రేమించిన వారే గొంతు కోస్తున్నారు!

International Day for the 'Elimination of Violence against Women' : ప్రపంచంలో.. ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ/బాలిక.. భాగస్వామి లేదా కుటుంబస సభ్యుల చేతుల్లో హత్యకు గురవుతోంది! ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్​ ఆంటోనియో గుటేర్రస్​ వెల్లడించారు. ఇండియాలో కలకలం సృష్టించిన శ్రద్ధ హత్య కేసు నేపధ్యంలో గుటేర్రస్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇలా మహిళలు హత్యకు గురవుతుండటం.. మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘింస్తుండటంతో సమానం అని గుటేర్రస్​ అభిప్రాయపడ్డారు. పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

UN chief Antonio Guterres : ఇంటర్నేషనల్​ డే ఫర్​ ఎలిమినేషన్​ ఆఫ్​ వాయలెన్స్​ అగైనెస్ట్​ ఉమెన్​ను ప్రతి యేటా నవంబర్​ 25న నిర్వహిస్తారు. ఈ ఏడాది "యూనైట్​- యాక్టివిజం టు ఎండ్​ వాయలెన్స్​ అగైనెస్ట్​ ఉమెన్​ అండ్​ గర్ల్స్​" అనే థీమ్​ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే గుటేర్రస్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"మహిళలు, బాలికలపై హింసతో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. భాగస్వాములు, కుటుంబ సభ్యుల చేతిలో ప్రతి 11 నిమిషాలకొక మహిళ/ బాలిక ప్రాణాలు కోల్పోతోంది. కొవిడ్​ సంక్షోభం, ఆర్థి అస్థిరతతో మహిళలపై హింస మరింత పెరిగింది," అని గుటేర్రస్​ పేర్కొన్నారు.

UN chief Antonio Guterres woman rights : లైంగిక వేధింపులు, వ్యక్తిత్వంపై దాడి, ఆన్​లైన్​ అబ్యూజ్​లతో మహిళలు చిత్రహింసలకు గురవుతున్నారని యూఎన్​ చీఫ్​ పేర్కొన్నారు.

"ఇలా మహిళలపై దాడి చేస్తే.. సగం మానవాళిని హింసిస్తున్నట్టే. జీవితంలో మహిళలు, బాలికలు ముందడుగు వేయలేరు. ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వాన్ని కోల్పోతున్నారు." అని గుటేర్రస్​ తెలిపారు.

ప్రభుత్వాలు జాతీయస్థాయి యాక్షన్​ ప్లాన్​ను అమలు చేసి, సమాజంలో కూకటివేళ్లతో సహా ఈ అరాచకాలను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు గుటేర్రస్​. ఇందుకు తగ్గట్టుగానే చట్టలు రూపొందించి, బాధితుల్లో న్యాయంపై నమ్మకాన్ని పెంచాలన్నారు. మహిళల హక్కులను పర్యవేక్షించే సంస్థలకు. 2026 నాటికి నిధులను 50శాతం పెంచాలని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొని.. అందరు ఫెమినిస్ట్​లమని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.

శ్రద్ధ వాల్కర్​ హత్య కేసు..

Shraddha walker news : దేశంలో శ్రద్ధ వాల్కర్​ హత్య కేసు కలకలం సృష్టించింది. అఫ్తాబ్​ అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేసేది. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అఫ్తాబ్​.. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. శ్రద్ధకు న్యాయం జరగాలని సర్వత్రా డిమాండ్​లు వ్యక్తమవుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం