డోనాల్డ్ ట్రంప్ విధానాలను ఎదుర్కోనేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి : ఫ్రాన్స్ ప్రధాని
Donald Trump : డోనాల్డ్ ట్రంప్ విధానాలను ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బైరూ అన్నారు. లేకుంటే మొత్తం ఐరోపా నష్టపోతుందని చెప్పారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సమయం దగ్గరపడింది. ప్రమాణస్వీకారానికి ముందే ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బైరూ యూరప్‌ను హెచ్చరించారు. డోనాల్డ్ ట్రంప్ విధానాలను ఎదుర్కోకపోతే యూరప్, ఫ్రాన్స్‌లు నలిగిపోతాయని ఆయన అన్నారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే అమెరికా ఆధిపత్య రాజకీయాలు ప్రారంభమవుతాయని బైరు అన్నారు. మనం ఏం చేయకపోతే పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఫ్రాన్స్, యూరప్ దేశాలు కలిసి భవిష్యత్తును నిర్ణయించుకోవాలన్నారు.

'యూరోపియన్ యూనియన్ అమెరికా ఉత్పత్తుల కొనుగోళ్లను తగ్గిస్తోందని ఎన్నికల్లో గెలవడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అందువల్ల యూరప్ దేశాలు ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. యూరోపియన్ యూనియన్ గొప్పగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇది ఐరోపాలోని చిన్న దేశాల సమూహం. మా కార్లు కొనరు. వారు మా వ్యవసాయ ఉత్పత్తులను కొనరు. అదే సమయంలో అమెరికాలో మిలియన్ల కార్లను విక్రయిస్తారు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.' అని ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బైరూ అన్నారు.
మనం ఏం చేయకపోతే..ఆధిపత్యం చెలయిస్తారన్నారు. అంతర్జాతీయ వేదికపై ఫ్రాన్స్, యూరప్‌లు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బైరూ చెప్పారు. 'అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విధానాలపై ప్రతిస్పందించడంలో విఫలమైతే ఫ్రాన్స్, ఈయూ అణచివేతకు గురువుతాయి.' ఫ్రాంకోయిస్ బేరో హెచ్చరించారు.
యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో అమెరికన్ ఎగుమతులను కొనుగోలు చేయనందుకు యూరోపియన్ యూనియన్ మూల్యం చెల్లించవలసి ఉంటుందని ట్రంప్ కామెంట్స్ చేశారు. ఈ మాటలను గుర్తు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతో నమ్మశక్యం కాని ఆధిపత్య రాజకీయాలు ఉంటాయన్నట్టుగా మాట్లాడారు. ఏం చేయకపోతే.. ఆధిపత్యం చెలాయించి అణిచివేస్తారన్నారు.