Euro zone inflation soars: యూరో జోన్‌లో ధరల మంట.. 10.7 శాతానికి ద్రవ్యోల్భణం-euro zone inflation soars past forecasts to new record high ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Euro Zone Inflation Soars Past Forecasts To New Record High

Euro zone inflation soars: యూరో జోన్‌లో ధరల మంట.. 10.7 శాతానికి ద్రవ్యోల్భణం

HT Telugu Desk HT Telugu
Oct 31, 2022 04:04 PM IST

Euro zone inflation soars: యూరో జోన్‌లో ద్రవ్యోల్భణం కొత్త గరిష్టాలకు చేరుకుంది.

యూరో జోన్‌లో ధరల మంట (ఫైల్ ఫోటో)
యూరో జోన్‌లో ధరల మంట (ఫైల్ ఫోటో) (AFP)

Euro zone inflation soars: యూరో జోన్‌లో ద్రవ్యోల్భణం సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంది. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లు పెంచకతప్పదని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

యూరో చలామణిలో ఉన్న 19 దేశాల్లో వినియోగ ధరల వృద్ధి సెప్టెంబరులో 9.9 శాతం ఉండగా.. అక్టోబరు మాసంలో అది 10.7 శాతానికి పెరిగింది. రాయిటర్స్ పోల్‌లో వెల్లడైన అంచనాలు 10.2 శాతం ఉండగా, ఈ పోల్ అంచనాలను కూడా అధిగమించి ద్రవ్యోల్భణం రికార్డుస్థాయికి చేరుకుంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో అంచనాలను మించి ద్రవ్యోల్భణం నమోదైందని సోమవారం వెల్లడైన యూరో స్టాట్ డేటా ద్వారా అర్థమవుతోంది.

ఇంధన ధరలు పైపైకి పెరుగుతూ అధిక ద్రవ్యోల్భణానికి కారణమైంది. ఇక ఆహారం, ఇండస్ట్రియల్ గూడ్స్ దిగుమతులు ధరలు ఎక్కువగా పెరగడానికి కారణమయ్యాయి. ద్రవ్యోల్భణం పెరగడంలో సేవా రంగం పాత్ర ఈసారి నామమాత్రంగా ఉంది.

గడిచిన మూడు నెలల్లో యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) 200 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరులోగా మరోసారి వడ్డీ రేట్లు పెంచే సంకేతాలు ఇచ్చింది. అయితే రేట్ల పెంపు నెమ్మదించవచ్చని మార్కెట్లు ఆశిస్తూ వచ్చాయి. గ్యాస్ ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గడం కూడా మార్కెట్ల ఆలోచనకు దోహదం చేశాయి.

కానీ ఆహారం, ఇంధన ధరల్లో అనిశ్చితి కారణంగా ధరల పెరుగుదలలో వృద్ధి ఉంటుందని విధాన రూపకర్తలు ఆందోళన చెందుతున్నారు.

నిజానికి ప్రాసెస్ చేయని ఫుడ్, ఇంధనం ధరలను మినహాయిస్తే ద్రవ్యోల్భణం 6.0 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులను మినహాయిస్తే అది 4.8 శాతం నుంచి 5.0 శాతానికి మాత్రమే పెరిగింది.

IPL_Entry_Point