ESIC Recruitment: ఈఎస్ఐ లో వెయ్యికి పైగా పారా మెడికల్ పోస్ట్ లు; వెంటనే అప్లై చేయండి
ESIC Recruitment 2023: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో గ్రూప్ సీ పారా మెడికల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 30.
ESIC Recruitment 2023: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో గ్రూప్ సీ పారా మెడికల్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో మొత్తం 1038 గ్రూప్ సీ పారా మెడికల్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ కోసం esic.gov.in వెబ్ సైట్ ను చూడండి.
ట్రెండింగ్ వార్తలు
లాస్ట్ డేట్ అక్టోబర్ 30
ఈఎస్ఐసీ (ESIC) లో గ్రూప్ సీ పారా మెడికల్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 30 వ తేదీతో ముగుస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ లోగా ఈఎస్ఐసీ అధికారిక వెబ్ సైట్ esic.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు రూ. 850 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు రూ. 250 చెల్లించాలి.
how to apply: ఇలా అప్లై చేయండి..
- ఈఎస్ఐసీ (ESIC) వెబ్ సైట్ www.esic.gov.in ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే recruitment లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత స్క్రీన్ పై కనిపించే Click here to Submit an Online Application for Recruitment to the Paramedical Posts in ESIC" లింక్ పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ పై అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. దాన్ని ఫిల్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- సబ్మిట్ బటన్ నొక్కి, అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.