Telugu News  /  National International  /  Equity Markets Spooked Amid Russia-ukraine Crisis
కుప్పకూలిన మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం)
కుప్పకూలిన మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం) (REUTERS)

Russia-Ukraine crisis | కుప్పకూలిన మార్కెట్లు

24 February 2022, 9:55 ISTHT Telugu Desk
24 February 2022, 9:55 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లో ప్రత్యేక ‘మిలిటరీ ఆపరేషన్’ ప్రకటించడంతో ఈక్విటీ సూచీలు కుప్పకూలాయి.

ముంబై: ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించగానే ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం ప్రారంభించాయి.

ట్రెండింగ్ వార్తలు

మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్ 1432.50 పాయింట్లకు, నిఫ్టీ 410.70 పాయింట్లకు పడిపోయాయి. ఉదయం 9.51 సమయంలో సెన్సెక్స్ 1950 పాయింట్లు కోల్పోయి 55,282 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

అదేవిధంగా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ ఉదయం 9.52 గంటలకు 552 పాయింట్లు కోల్పోయి 16552 వద్ద ట్రేడవుతోంది.

తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న డాన్‌బాస్‌ను రక్షించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున ప్రత్యేక ‘సైనిక ఆపరేషన్’ ప్రకటించారు.

అత్యవసర సందేశాన్ని అందించిన పుతిన్, ఉక్రెయిన్ దేశంలో పాశ్యాత్య దేశాల సేనలను నిర్వీర్యం చేయడానికి ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. 

ఉక్రెయిన్-రష్యా సంక్షోభ ఫలితంగా 8 సంవత్సరాలలో మొదటిసారి బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 100 డాలర్లకు పెరిగింది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ అమ్మకాల జోరును కొనసాగిస్తూ బుధవారం భారత క్యాపిటల్ మార్కెట్లలో రూ. 3,417.16 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా వెల్లడించింది.

 

సంబంధిత కథనం

టాపిక్