Pension : పెన్షన్​ని కేంద్రం రెట్టింపు చేస్తుందా? లేటెస్ట్​ అప్డేట్స్​ తెలుసుకోండి..-epfo pension latest updates on doubling the pension under eps 95 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pension : పెన్షన్​ని కేంద్రం రెట్టింపు చేస్తుందా? లేటెస్ట్​ అప్డేట్స్​ తెలుసుకోండి..

Pension : పెన్షన్​ని కేంద్రం రెట్టింపు చేస్తుందా? లేటెస్ట్​ అప్డేట్స్​ తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu
Dec 13, 2024 11:10 AM IST

EPFO Pension alert : ఉద్యోగుల కనీస పెన్షన్​ని పెంచాలని, ప్రస్తుతం నెలకు రూ. 1000గా ఉన్నదాన్ని రూ. 2000వేలకు తీసుకెళ్లాలని ఇప్పటికే అనేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. వీటిపై లేటెస్ట్​ అప్డేట్స్​ ఇక్కడ తెలుసుకోండి..

కనీస పెన్షన్​ లిమిట్​ని కేంద్ర పెంచుతుందా?
కనీస పెన్షన్​ లిమిట్​ని కేంద్ర పెంచుతుందా? (image source from unsplash.com)

ఈపీఎస్​ (ఎంప్లాయీస్​ పెన్షన్​ స్కీమ్​) 1995 కింద కనీస పెన్షన్​ని పెంచాలని చాలా ఏళ్లుగా ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంతకాలం సానుకూలంగా స్పందించలేదు. కాగా పార్లమెంట్​లో ఈ వ్యవహారం మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కనీస పింఛను పెంపు విషయంపై ప్రభుత్వ వైఖరికి సంబంధించి లేటెస్ట్​ అప్డేట్స్​ ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

కనీస పెన్షన్​ని పెంచుతారా?

"ఈపీఎస్​-95 కింద కనీస పెన్షన్​ పెంపుపై అభ్యర్థనలు ఏవైనా వచ్చాయా?" అని పార్లమెంట్​లో ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ వేసిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి స్పందించారు.

"ప్రస్తుతం కనీస పింఛను నెలకు రూ. 1000గా ఉంది. 2014 నుంచి ఇదే కొనసాగుతోంది. పింఛను అమౌంట్​ని పెంచాలని కార్మిక-ఉద్యోగశాఖకు పింఛనుదారులు, ట్రేడ్​ యూనియన్ల నుంచి విజ్ఞప్తులు అందాయి," అని పంకజ్​ చౌదరి వెల్లడించారు.

ప్రస్తుత ఈపీఎస్​ 95 రూల్స్​..

ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​లో ఫండ్​లో ప్రస్తుతం 8.33శాతం వాటా ఉద్యోగుల జీతాలపై యజమాని ఇస్తున్నారు. ఇక జీతంలోని 1.16శాతం కేంద్ర ప్రభుత్వం (నెలకు గరిష్ఠంగా రూ. 15వేలు) ఇస్తోంది.

ఈ ఫండ్​ని వార్షికంగా మూల్యాకణం చేస్తారు. కానీ ఈ ప్రక్రియ చివరిగా 2019 మార్చ్​లో జరిగింది. ఆ సమయంలో ఈ ఫండ్​.. లోటు నిధులతో ఉందని తేలింది. అందుకే పెన్షన్​ పెంపు వ్యవహరంపై గతంలో వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది.

కనీస పెన్షన్​ రూ. 2000..!

ప్రస్తుతం రూ. 1000గా ఉన్న నెలవారీ కనీస పెన్షన్​ని రూ. 2000వేలకు పెంచాలని కార్మికశాఖ గతంలోనే కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కన పెట్టింది.

ఈపీఎస్​ 95 కింద ఉద్యోగుల కనీస పెన్షన్​ పెంపు ప్రతిపాదలను ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటున్నాయి. కానీ వీటిని ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. ఎప్పుడు ఆమోదిస్తుందనే విషయంపైనా స్పష్టతనివ్వలేదు. అందుకే, ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడేంత వరకు కనీస పెన్షన్​ రూ. 1000గానే ఉంటుంది.

ఏటీఎంలో పీఎఫ్​​ని విత్​డ్రా చేసుకోండి..

2025 నుంచి ఈపీఎఫ్ఓ చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్​) ని ఏటీఎంల ద్వారా ఉపసంహరించుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తాజాగా ప్రకటించారు. దేశంలోని విస్తృత శ్రామిక శక్తికి మెరుగైన సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ ఐటి వ్యవస్థలను అప్ గ్రేడ్ చేస్తోందని ఆమె హైలైట్ చేశారు. అదే సమయంలో పీఎఫ్ సేవలను మరింత విస్తరించే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.