EPFO PF transfer : పాత రూల్కి ఈపీఎఫ్ఓ గుడ్ బై! ఇక ప్రాసెస్ మరింత సింపుల్..
పీఎఫ్ నిధులను బదిలీ ప్రక్రియను గత, ప్రస్తుత యజమానుల ద్వారా మళ్లించాలనే నిబంధనను ఈపీఎఫ్ఓ తొలగించింది. ఇది ఉద్యోగులు ఉద్యోగాలు మారడానికి సులభతరం చేసింది.
పీఎఫ్ ప్రాసెస్‌ని సరళతరం చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్).. మరో కొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో పని చేసిన ఎంప్లాయర్‌తో పాటు ప్రస్తుత కంపెనీకి ఉద్యోగి సమర్పించాల్సిన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ నిబంధనను తొలగించేసింది. ఈ మేరకు జనవరి 15న ఒక సర్క్యులర్ని విడుదల చేసింది. ఉద్యోగులు ఉద్యోగాలు మారే సమయంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అన్న దానిపై ఈపీఎఫ్ఓ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

పాత రూల్ ఎత్తివేస్తే ఎవరికి లాభం?
- అక్టోబర్ 1, 2017న లేదా ఆ తర్వాత యూఏఎన్ కేటాయించిన అదే యూఏఎన్‌తో లింక్ అయి, ఆధార్‌తో లింక్ అయిన మెంబర్ ఐడీల మధ్య ఖాతా బదిలీలు.
- 2017 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత యూఏఎన్‌లను కేటాయించిన వివిధ యూఏఎన్లతో లింక్ చేసిన మెంబర్ ఐడీల (అదే ఆధార్‌తో లింక్ అయిన ఉన్నవి) మధ్య బదిలీలు.
- 2017 అక్టోబర్ 1కి ముందు ఆధార్‌తో లింక్ చేసి ఉన్న, పేరు, పుట్టిన తేదీ, జెండర్ ఒకే విధంగా ఉన్న అన్ని మెంబర్ ఐడీల (ఒకే యూఏఎన్‌తో లింక్ చేసి ఉన్న) మధ్య బదిలీ.
- 2017 అక్టోబర్ 1కి ముందు ఆధార్‌తో లింక్ చేసి ఉన్న, పేరు, పుట్టిన తేదీ, జెండర్ ఒకే విధంగా ఉన్న అన్ని మెంబర్ ఐడీల (వేరువేరు యూఏఎన్లు లింక్ చేసి ఉన్న) మధ్య బదిలీ.
యూఏఎన్ అంటే ఏమిటి?
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు కంట్రిబ్యూషన్ చేసే ప్రతి ఉద్యోగికి కేటాయించిన 12 అంకెల సంఖ్యను యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యూఏఎన్ అంటారు. ఈ నంబర్ని ఈపీఎఫ్ఓ జారీ చేస్తుంది.
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో యూఏఎన్‌ని ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?
స్టెప్ 1: ఈ-సేవ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ యూఏఎన్ వివరాలను ఉపయోగించి మీ ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: 'మేనేజ్' మెనూ కింద “నో యువర్ కస్టమర్ (కేవైసీ)” ఆప్షన్ ఎంచుకోండి.
స్టెప్ 4: ఆధార్ ఆప్షన్ని ఎంచుకుని మీ ఆధార్ సమాచారాన్ని ఉంచండి.
స్టెప్ 5: అన్ని వివరాలను సేవ్ చేయండి.
స్టెప్ 6: యూఐడీఏఐ డేటా ద్వారా ఆధార్ వివరాలు వెరిఫై అవుతాయి.
స్టెప్ 7: కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ ఆధార్ కార్డు మీ ఈపీఎఫ్ ఖాతాకు లింక్ అవుతుంది.
సంబంధిత కథనం