Crime news : కాలేజ్‌కి వెళుతున్న యువతిని గొడ్డలితో బెదిరించి.. అత్యాచారం!
Nagpur crime news : ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకుంటున్న ఓ యువతిపై అత్యాచారం జరిగింది. కాలేజ్‌కి వెళుతుండగా.. ఓ వ్యక్తి ఆమెను అడ్డగించి, గొడ్డలితో బెదిరించి, రేప్ చేశాడు!
Nagpur crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజ్‌కి వెళుతున్న యువతిని గొడ్డలితో బెదిరించి, అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి!
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బుధవారం జరిగింది ఈ ఘటన. నాగ్‌పూర్ శివారులో ఉన్న ఓ పెద్ద ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఓ 19ఏళ్ల యువతి బీటెక్ 2వ సంవత్సరం చదువుకుంటోంది. హింగ్న ప్రాంతంలో ఆమె ఓ రూమ్‌లో రెంట్‌కు ఉంటోంది.
కాగా.. బుధవారం ఎప్పటిలాగే ఇంటి నుంచి కాలేజ్‌కి బయలుదేరింది. ఉదయం 9:50 ప్రాంతంలో ఓ వ్యక్తి ఆమెను అడ్డగించాడు. గొడ్డలితో బెదిరించాడు. ఆమె భయపడిపోయింది.
College student raped : గొడ్డలితో బెదిరించిన అనంతరం.. యువతిని బలవంతంగా స్థానిక పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సాయం కోసం యువతి అరిచినా.. ఫలితం లేకపోయింది.
కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన అనంతరం ఆ 30ఏళ్ల వ్యక్తి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన నుంచి తేరుకున్న అనంతరం.. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనకు జరిగినది వివరించి, ఫిర్యాదు చేసింది.
College student raped in Nagpur : రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. కాగా.. నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. యువతి ఇచ్చిన వివరాలతో నిందితుడిని వెంటనే పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఇద్దరిపై ఆరుగురు సామూహిక అత్యాచారం..!
దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా మారాయి. తాజాగా.. ఇద్దరు మైనర్లపై ఆరుగురు రేప్ చేసిన ఘటన ఝార్ఖండ్‌లోని పశ్చిమ్ సింఘ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది.
బాధితుల వయస్సు 16ఏళ్లు అని తెలుస్తోంది. గత వారం ఈ ఘటన జరగ్గా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. మైనర్లపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న 24 గంటల్లోనే.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ఆరుగురిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.
సంబంధిత కథనం