ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్; కీలక నేత బసవరాజు సహా 25 మంది వరకు మావోలు మృతి చెందినట్లు సమాచారం-encounter breaks out between security forces and naxalites in narayanpur chhattisgarh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్; కీలక నేత బసవరాజు సహా 25 మంది వరకు మావోలు మృతి చెందినట్లు సమాచారం

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్; కీలక నేత బసవరాజు సహా 25 మంది వరకు మావోలు మృతి చెందినట్లు సమాచారం

Sudarshan V HT Telugu

ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ లో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారు జాము నుంచి కొనసాగుతున్న ఈ ఎన్ కౌంటర్ లో దాదాపు 25 మంది వరకు మావోలు మృతి చెందినట్లు సమాచారం.

ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం తెల్లవారు జాము నుంచి భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల మాడ్ డివిజన్ కు చెందిన సీనియర్ కేడర్లు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో నాలుగు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్స్ పోలీసు బృందాలు అభుజ్ మఢ్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

మావోలకు భారీ ఎదురుదెబ్బ?

ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో కకావికలైన మావోయిస్టులు బుధవారం నాటి ఎన్ కౌంటర్ తో మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నారాయణపూర్ ఎన్ కౌంటర్ లో సుమారు 25 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి!

చత్తీస్‌గడ్‌ నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మావోల కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. నారాయణపూర్‌ జిల్లా మాధ్‌ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌ కౌంటర్‌ కొనసాగుతోంది. బసవరాజు ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. నారాయణపూర్‌,బీజాపూర్‌, దంతేవాడ బలగాల నేతృత్వంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో బసవరాజు సహా పలువురు మావోయిస్టుల మృతి చెందినట్టు తెలుస్తోంది. బసవరాజుపై రూ. 1.5 కోట్ల రివార్డు ఉంది. బసవరాజు మృతిపై మరి కాసేపట్లో నారాయణపూర్ ఎస్పీ అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.