Twitter layoffs: మరో 4వేల మందిని తీసేసిన ఎలాన్ మస్క్! ఈసారి వారి వంతు-elons musk fires over 4000 twitter contractual employees ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Elons Musk Fires Over 4000 Twitter Contractual Employees

Twitter layoffs: మరో 4వేల మందిని తీసేసిన ఎలాన్ మస్క్! ఈసారి వారి వంతు

Twitter layoffs: మరో 4వేల మందిని తీసేసిన ఎలాన్ మస్క్! ఈసారి వారి వంతు
Twitter layoffs: మరో 4వేల మందిని తీసేసిన ఎలాన్ మస్క్! ఈసారి వారి వంతు (HT_PRINT)

Elon Musk - Twitter layoffs: మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది ట్విట్టర్. ఈసారి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికారు ఆ కంపెనీ నయా బాస్ ఎలాన్ మస్క్.

Elon Musk - Twitter layoffs: మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ లో 50 శాతం మంది ఉద్యోగులను ఆ కంపెనీ బాస్ ఎలాన్ మస్క్ గత వారం తొలగించారు. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న వారంలోపే ఆయన ఇంత భారీ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 3,500 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో ఎంప్లాయిస్‍ను మస్క్ తొలగించారని తెలుస్తోంది. ఈసారి ట్విట్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేటు వేశారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ కోసం కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 4వేల మందిని పైగా విధుల్లో నుంచి ఆ కంపెనీ తొలగించినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని తీసేసినట్టు పేర్కొంది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Elon Musk - Twitter layoffs: యాక్సెస్ కట్

కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న సుమారు 4,400 మందికి పైగా ఉద్యోగులను ట్విట్టర్ తొలగించిందని ప్లాట్‍ఫార్మర్ (Platformer)వెల్లడించింది. ఆ ఉద్యోగులు వారి అఫీషియల్ మెయిల్, ఆన్‍లైన్ సర్వీసులతో పాటు కంపెనీ ఇంటర్ కమ్యూనికేషన్స్ కు సంబంధించిన యాక్సెస్‍ను కోల్పోయారని వెల్లడించింది.

Elon Musk - Twitter layoffs: ఆ విభాగాలపై ఎక్కువ ప్రభావం

“4,400 నుంచి 5,500 మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులను ట్విట్టర్ తీసేసినట్టు ఆ కంపెనీ వర్గాలు నాకు చెప్పాయి. దీంతో కంటెంట్ మోడరేషన్, ఇన్‍ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్‍లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా. ఈ చర్యతో కంపెనీలో ఉన్న వారు నిర్ఘాంతపోయారు” అని ప్లాట్‍ఫార్మర్ కు చెందిన క్యాసీ న్యూటన్ ట్వీట్ చేశారు.

మార్కెటింగ్, కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, ఇంజినీరింగ్‍ విభాగాల్లో గ్లోబల్ ఆపరేషన్స్ చూసుకుంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ట్విట్టర్ తాజాగా తీసేసిందని మరో రిపోర్ట్ కూడా వెల్లడైంది.

Twitter Blue Subscription: మళ్లీ ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ అప్పుడే..

వచ్చే వారాంతంలో ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్‍ను మళ్లీ తీసుకురానున్నట్టు ఎలాన్ మస్క్ చెప్పారు. నకిలీ ఖాతాల బెడద పెరిగిపోవటంతో బ్లూ సబ్‍స్క్రిప్షన్‍ను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే వచ్చే వారంతానికి ఈ సబ్‍స్క్రిప్షన్‍ను యూజర్లకు మళ్లీ అందుబాటులోకి వస్తుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. వెరిఫైడ్ బ్లూటిక్ కోసం నెలకు 8డాలర్ల చార్జీతో సబ్‍స్క్రిప్షన్ సర్వీస్‍ను ఇటీవల ప్రవేశపెట్టింది ట్విట్టర్. అయితే నకిలీ ఖాతాలు సమస్యగా మారటంతో తాత్కాలికంగా నిలిపివేసింది.

Twitter layoffs : సీఈవో నుంచి ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు..

44 బిలియన్ డాలర్ల డీల్‍ను పూర్తి చేసుకొని అక్టోబర్ లో ట్విట్టర్‍ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్‍తో పాటు మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‍లను తీసేశారు. ఆ తర్వాత ఏకంగా 50శాతం మంది ఉద్యోగాలను తొలగించారు. ఇప్పుడు తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు సమాచారం. దీంతో వేలాది మంది ట్విట్టర్ ఎంప్లాయిస్ ఒక్కసారిగా రోడ్డునపడినట్టయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని సమాచారం.

WhatsApp channel