GSAT-N2 satellite : అత్యంత కీలకమైన ఇస్రో శాటిలైట్‌ని లాంచ్ చేసిన స్పేస్ఎక్స్..
ISRO SpaceX collaboration : ఇస్రోకి చెందిన అత్యంత కీలకమైన, ప్రతిష్ఠాత్మకమైన జీశాట్ ఎన్2 ఉపగ్రహాన్ని ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ విజయవంతంగా లాంచ్ చేసింది. భారత దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం ఈ జీశాట ఎన్2 లక్ష్యం.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్‌ని ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ సాయంతో అంతరిక్షంలోకి పంపించింది. అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కనావెరాల్ నుంచి సోమవారం అర్థరాత్రి ఫాల్క్ 9 రాకెట్లో ఇస్రోకి చెదిన జీశాట్-ఎన్2 (జీశాట్ 20) నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రోకి చెందిన అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఈ జీశాట్- ఎన్2. భారత దేశ మారుమూల గ్రామాలకు సైతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడం, విమానాల్లో ప్రయాణికులకు ఇన్-ఫ్లైట్ ఇంటర్నెట్‌ని ఇవ్వడం ఈ ఉపగ్రహం లక్ష్యం.
ఈ రాకెట్ లాంచ్ ప్రక్రియ 34 నిమిషాల పాటు సాగింది. స్పేస్ఎక్స్ అధికారిక ఎక్స్ అకౌంట్లో లైవ్‌స్ట్రీమ్ అయ్యింది.
ఇస్రో ఉపగ్రహాన్ని స్పేస్ఎక్స్ ఎందుకు లాంచ్ చేసింది?
ఈ జీశాట్ ఎన్2 (జీశాట్ 20) ప్రాజెక్ట్‌ని ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అయితే దీని బరువు 4700 కిలోలు! ఇది భారత రాకెట్ల సామర్థ్యాన్ని మించిపోయింది. అందువల్ల శాటిలైట్ లాంచ్ కోసం స్పేస్ఎక్స్ని ఇస్రో ఎంచుకుంది.
ఈ మిషన్ మొత్తం ఖర్చు 60-70 మిలియన్ డాలర్లు.
కనెక్టివిటీ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్కు పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చేందుకు జీశాట్-ఎన్2ను రూపొందించారు. ఈశాన్య రాష్ట్రాలకు అంకితం చేసిన ఎనిమిదితో సహా నారో-వైడ్ స్పాట్ బీమ్ల కలయికను కలిగి ఉన్న ఈ ఉపగ్రహం నిర్మాణం ఫ్రీక్వెన్సీ పునర్వినియోగానికి అనుమతిస్తుంది! దాని సామర్థ్యం, కవరేజీని బాగా పెంచుతుంది. చిన్న యూజర్ టెర్మినల్స్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించే ఈ ఉపగ్రహం పెద్ద సబ్‌స్క్రైబర్ బేస్‌ని అందిస్తుంది.
ఆగస్టు చివరిలో స్పేస్ఎక్స్తో భాగస్వామ్యాన్ని ధృవీకరించారు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. ఉపగ్రహం ఇప్పటికే ప్రయోగ సన్నాహాల కోసం యునైటెడ్ స్టేట్స్‌కి వెళుతోందని మింట్ ఇంతకు ముందు నివేదించింది.
జీశాట్-ఎన్2 ప్రయోగం భారత అంతరిక్ష, టెలికమ్యూనికేషన్ ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి. భారతదేశ విస్తారమైన, వైవిధ్యమైన భూభాగం అంతటా కనెక్టివిటీని మెరుగుపరిచే విస్తృత మిషన్‌లో భాగంగా కూడా ఇది పనిచేస్తుంది.
భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను విస్తరించడానికి స్పేస్ఎక్స్ చేసిన ప్రయత్నాల వెనుక ఈ మిషన్ ఉంది! ఈ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఎలాన్ మస్క్ ఆమోదం కోసం లాబీయింగ్ చేశారు. జీశాట్-ఎన్2 ప్రయోగం, ఇస్రో- స్పేస్ఎక్స్ మధ్య పెరుగుతున్న సహకారంతో పాటు, సాంకేతిక పురోగతి, అంతరిక్ష అన్వేషణలో అంతర్జాతీయ సహకారానికి కొత్త శకాన్ని సూచిస్తుంది.
సంబంధిత కథనం