Musk shares Twitter new CEO picture: ట్విటర్ కు కొత్త సీఈఓ; ఎవరో తెలుసా?-elon musk shares picture of new ceo of twitter says he is amazing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Elon Musk Shares Picture Of 'New Ceo Of Twitter,' Says He Is 'Amazing'

Musk shares Twitter new CEO picture: ట్విటర్ కు కొత్త సీఈఓ; ఎవరో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 04:39 PM IST

Twitter new CEO చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ట్విటర్ (Twitter) సీఈఓ పోస్ట్ ను ఎలాన్ మస్క్ (Elon Musk) భర్తీ చేశారు. కొత్త సీఈఓ తన సీట్లో కూర్చున్న ఫొటోను షేర్ చేశారు. దానిపై, నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు.

మస్క్ షేర్ చేసిన ట్విటర్ సీఈఓ ఫొటో
మస్క్ షేర్ చేసిన ట్విటర్ సీఈఓ ఫొటో

ట్విటర్ (Twitter) ను కొనుగోలు చేసిన నాటి నుంచి వింత వింత నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk). ఉద్యోగుల విధుల్లో మార్పులు, వర్క్ ఫ్రం హోం తొలగింపు, లే ఆఫ్స్, సీనియర్ ఉద్యోగులతో విబేధాలు.. ఇలా అన్నీ వివాదాస్పదం చేస్తున్నారు. తాజాగా ట్విటర్ కు కొత్త సీఈఓ అంటూ మస్క్ (Elon Musk) ట్విటర్ (Twitter) లో షేర్ చేసిన ఫొటో కూడా వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Pet dog as Twitter new CEO: పెంపుడు కుక్కను సీఈఓ చేశాడు..

తన పెంపుడు కుక్క షిబా ఇను, ఫ్లొకీకి సూటు, బూటు, షూ తొడిగి, దాన్ని సీఈఓ సీట్లో కూర్చోబెట్టి ఓ ఫొటో తీసి, ఆ ఫొటోను ట్విటర్ (Twitter) కొత్త సీఈఓ అంటూ సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ (Elon Musk) షేర్ చేశారు. అంతేకాదు, ఈ సీఈఓ గతంలో ఉన్న వారికన్నా బెటరే అంటూ ఒక కామెంట్ కూడా చేశారు. ట్విటర్ లో సాధారణ స్థితి నెలకొనడానికి మరో సంవత్సరమైనా పడుతుందని Elon Musk వ్యాఖ్యానించారు. ఆ తరువాతనే, సీఈఓ గా వేరే వ్యక్తిని నియమిస్తానని వెల్లడించారు. ‘ఈ సంవత్సరం చివరి నాటికి కంపెనీని నడపడానికి కొత్త వ్యక్తిని నియమించే అవకాశముంది’ అని ట్వీట్ చేశారు. తన పెంపుడు శునకం టాలెంట్స్ ను మరో ట్వీట్ లో Elon Musk వివరించారు.

Netizens reactions to Musk tweet: నెటిజన్ల స్పందన

పెంపుడు కుక్కను Twitter సీఈఓ గా Elon Musk ప్రకటించడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఫన్నీ కామెంట్లతో రెస్పాండవుతున్నారు. ‘ అవును.. ఈ ఉద్యోగం కోసం ఆ కుక్క ఒక్కటే ఆసక్తి చూపిందనుకుంటా’ అని ఒక నెటిజన్ పగలబడి నవ్వుతున్న ఎమోజీని జత చేసి కామెంట్ చేశారు. ఆ కామెంట్ కు కూడా మస్క్ (Elon Musk) స్పందించారు. ’యెస్.. ఈ జాబ్ కు అదే పర్ఫెక్ట్’ అని ఆయన రిప్లై ఇచ్చారు. ఓపెన్ స్పేసెల్ లో పార్టిసిపేట్ చేయడానికి కుక్కలకు అనుమతి ఉంటుందా? అని ఒక ట్విటర్ (Twitter) యూజర్ అనుమానం వ్యక్తం చేశారు.

Poll in Twitter: ట్విటర్ లో పోల్

గతంలో ట్విటర్ సీఈఓ గా ఎవరు బెటర్ అని ట్విటర్ (Twitter) లోని తన ఫాలోవర్స్ లో ఒక పోల్ ను మస్క్ (Elon Musk) కండక్ట్ చేశారు. అందులో 60% పైగా ‘నువ్వు (మస్క్) మాత్రం వద్దు’ అని స్పందించారు. ట్విటర్ పై ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం వల్ల టెస్లా కోసం ఎక్కవ సమయం కేటాయించలేకపోవచ్చనే ఉద్దేశాన్ని కొందరు వెలిబుచ్చారు.

WhatsApp channel

టాపిక్