Elon Musk says 'Namaste to critics: ‘మీకో దండం’ అంటూ విమర్శకులకు మస్క్ రిప్లై
Musk says 'Namaste: ఇటీవల రెగ్యులర్ గా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న టెస్లా చీఫ్, ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్.. తాజాగా వెరైటీ ‘నమస్తే’తో మన ముందుకు వచ్చారు.
ట్విటర్ ను కొనుగోలు చేసే ప్రయత్నాల నుంచి ప్రారంభిస్తే.. సంస్థ నుంచి ఉద్యోగులను సాగనంపే ప్రయత్నాల వరకు.. వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.
Musk faces criticism: విమర్శల వెల్లువ
తాజాగా, ఆయన నిర్ణయాలపై ట్విటర్ లోనూ, ఇతర సోషల్ మీడియా మధ్యమాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు, వర్కింగ్ కండిషన్స్ లో మార్పులు, వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని తొలగించడం, సీనియర్ మోస్ట్ ఉద్యోగులకు ఉద్వాసన పలకడం.. ఇవన్నీ మస్క్ పై నెటిజన్ల వ్యతిరేకతను విపరీతంగా పెంచాయి. అదీకాకుండా, ఇప్పటికే ట్విటర్ నిషేధించిన ఖాతాలకు మళ్లీ అవకాశమివ్వడాన్ని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Musk tweets Namasthe: విమర్శలపై విసుగెత్తి..
తన తీరుపై ట్విటర్ లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఈ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పెట్టేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. తన విమర్శకులంతా ట్విటర్ ను వదిలేసి, దయచేసి వేరే ప్లాట్ ఫామ్ ను వెతుక్కోండని సలహా ఇచ్చారు. దాంతో పాటు ‘నమస్తే’ అని టైప్ చేసి, రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్న ఎమోజీని యాడ్ చేశారు. అంటే, ‘మీకు, మీ విమర్శలకు ఓ దండం’ అని అర్థం వచ్చేలా ట్వీట్స్ చేశాడు.
Huge response from netizens: ఈ ట్వీట్ కు కూడా భారీ స్పందన
నమస్తే అంటూ మస్క్ చేసిన ట్వీట్ పై కూడా ట్విటర్ యూజర్లు భారీగా స్పందించారు. వారు కూడా నమస్తే అని, నమస్తే ఎమోజీతో కామెంట్లు చేశారు. ‘ఇదో రకం రివర్స్ సైకాలజీ ట్రికా?’ అని ఒక యూజర్ ప్రశ్నించగా.. దానికి మస్క్ ‘అవును.. రివర్స్, రివర్స్ సైకాలజీ ట్రిక్’ అని స్పందించారు.