Twitter 2.0: ట్విట్టర్‌లోనే డైరెక్ట్ మెసేజ్‍లు, పేమెంట్స్, మరిన్ని సర్వీస్‍లు.. ప్రకటించిన మస్క్
Twitter 2.0 - The everything App: ట్విట్టర్‌ను ఎవ్రీథింగ్ యాప్‍గా మార్చేందుకు ఎలాన్ మస్క్ ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ట్విట్టర్‌లో డైరెక్ట్ మెసేజ్‍లు, పేమెంట్స్, లాంగ్ ఫామ్స్ ట్వీట్స్ లాంటి మరిన్ని ఫీచర్లు వస్తాయని సంకేతాలు ఇచ్చారు.
Twitter 2.0 - The everything App: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన మాస్టర్ ప్లాన్‍ను అమలు చేసేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియా నెట్‍వర్క్, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్‍గా ఉన్న ట్విట్టర్ స్వరూపాన్ని మార్చేందుకు ఆయన పూనుకున్నారు. ట్విట్టర్‌ను ఎవ్రీథింగ్ యాప్‍గా మార్చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ నయా ట్విట్టర్ 2.0 ఎవ్రీథింగ్ యాప్‍లో ఏం ఉండనున్నాయో కూడా ప్రకటించారు. ఈ మేరకు కొన్ని స్లైడ్‍లను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
వాట్సాప్‍లా.. డైరెక్ట్ మెసేజింగ్ సర్వీస్
Twitter 2.0 - The everything App: ట్విట్టర్‌లో ఎన్‍క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‍ల సర్వీస్‍ను తీసుకురానున్నట్టు స్లైడ్‍ను షేర్ చేశారు మస్క్. అంటే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్‍లా ట్విట్టర్‌లోనూ చాట్ చేసుకోవచ్చు. ఇన్‍స్టంట్ మెసేజింగ్ ప్లాట్‍ఫామ్‍లానూ ఉపయోగపడుతుంది.
పేమెంట్స్
Twitter 2.0 - The everything App: ట్విట్టర్‌లో పేమెంట్స్ సదుపాయాం వస్తుందని స్లైడ్స్ ద్వారా మస్క్ తెలిపారు.
ప్రకటనలు, వీడియోలు
అడ్వర్టైజ్‍మెంట్లను ఎంటర్ టైన్‍మెంట్‍గా ఉంటాయని మస్క్ తెలిపారు. అలాగే వీడియో సంబంధిత ఫీచర్లపై కూడా ఎక్కువ దృష్టి సారించనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు అడ్వర్టైజ్‍మెంట్, వీడియోల గురించి కూడా స్లైడ్‍లలో హింట్ ఇచ్చారు.
లాంగ్ ఫామ్ ట్వీట్స్
Twitter 2.0 - The everything App: ఎక్కువ టెక్స్ట్ ఉండే ట్వీట్‍లను పోస్ట్ చేసే సదుపాయాన్ని లాంగ్‍ఫామ్ ట్వీట్స్ రూపంలో తీసుకురానున్నట్టు మస్క్ తెలిపారు. ఇక బ్లూ వైరిఫైడ్ సర్వీస్‍ను మళ్లీ లాంచ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
నియామకాలు!
ట్విట్టర్ లో త్వరలో ప్రపంచస్థాయి సాఫ్ట్ వేర్ నిపుణులు చేరతారని మస్క్ చెప్పారు. అంటే ట్విట్టర్ 2.0 కోసం నియామకాలను త్వరలో చేపట్టనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ట్విట్టర్‌లో సుమారు 3700 మందిని తొలగించిన మస్క్.. ఇక తీసివేతలు ఉండవని ఇటీవల చెప్పారు. ఇప్పుడు నియామకాలకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్స్ ఇచ్చారు.
“మేం రిక్రూట్ చేసుకుంటున్నాం. యూజర్ యాక్టివ్ మినిట్స్ ప్రస్తుతం ‘ఆల్ టైం హై’లో ఉన్నాయి. మానిటైజ్ అయ్యే అవకాశం ఉన్న డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 25కోట్ల మార్క్ దాటింది” అని ఉద్యోగులతో సమావేశంలో మస్క్ అన్నట్టు వెల్లడైంది. అలాగే ఇకపై అడ్వర్టైజ్‍మెంట్స్, వీడియోలపై ఎక్కువ దృష్టి సారించారన్నట్టు కూడా దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.
ట్విట్టర్ టిక్.. మూడు రంగులు
Twitter Verifications Badges: ట్విట్టర్ వెరిఫైడ్ టిక్ ఇక మూడు కలర్లలో ఉంటుందని మస్క్ ఇటీవల ప్రకటించారు. కంపెనీలకు గోల్డ్ కలర్, ప్రభుత్వాలకు గ్రే కలర్, వ్యక్తిగత ఖాతాలకు (సెలెబ్రెటిటీలు, బ్లూ సబ్‍స్క్రైబర్లు) బ్లూ కలర్ టిక్ ఉంటుందని చెప్పారు. వచ్చే వారంలో ఈ సర్వీస్‍ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.