Musk develops chip to put in brain: ఆరునెలల్లో మనిషి బ్రెయిన్ లో చిప్: మస్క్-elon musk is building a chip to put in your brain to communicate with computers
Telugu News  /  National International  /  Elon Musk Is Building A Chip To Put In Your Brain To Communicate With Computers
టెస్లా, న్యూరాలింక్ చీఫ్ ఎలాన్ మస్క్
టెస్లా, న్యూరాలింక్ చీఫ్ ఎలాన్ మస్క్ (REUTERS)

Musk develops chip to put in brain: ఆరునెలల్లో మనిషి బ్రెయిన్ లో చిప్: మస్క్

01 December 2022, 20:22 ISTHT Telugu Desk
01 December 2022, 20:22 IST

Musk develops chip to put in brain: మనిషి బ్రెయిన్ లో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే సాంకేతికత దిశగా ముందడుగు వేసినట్టు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వెల్లడించారు. మస్క్ స్థాపించిన ‘న్యూరాలింక్(Neuralink)’ సంస్థ ఈ దిశగా ప్రయోగాలను ముమ్మరం చేసింది.

Musk develops chip to put in brain: మనిషి మెదడులో చిప్ ను అమర్చడం ద్వారా.. ఆలోచనలతోనే కంప్యూటర్ ను ఆపరేట్ చేయడం సాధ్యమవుతుందని మస్క్ వివరించారు. అంతేకాకుండా, పలు వ్యాధులకు చికిత్సలను అందించడం కూడా సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా న్యూరాలింక్(Neuralink) పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయన్నారు.

Musk develops chip to put in brain: ఆరునెలల్లో..

మనిషి బ్రెయిన్ లో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రాజెక్టును మస్క్ కు చెందిన న్యూరాలింక్(Neuralink) చాన్నాళ్ల క్రితమే ప్రారంభించింది. మరో ఆరు నెలల్లో అలాంటి చిప్ రూపకల్పన, దానిని మనిషి మెదడులో అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని మస్క్ వివరించారు. ఆ చిప్ ద్వారా ఆలోచనల ద్వారానే కంప్యూటర్ ను ఆపరేట్ చేయడం సాధ్యమవుతుందన్నారు. ‘ఆరు నెలల్లో మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్ ను అమరుస్తాం. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం అన్ని పత్రాలను ఎఫ్ డీఏ((US Food and Drug Administration FDA)కు అందించాం.’ అని మస్క్ వెల్లడించారు.

Musk develops chip to put in brain: అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

మనిషి మెదడులో చిప్ ను పెట్టే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మస్క్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలని పూర్తి శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తున్నామన్నారు. చిప్ ను అమర్చే ముందే, దాని విపరిణామాలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. అలాగే, చిప్ ను అమర్చడం ద్వారా మనుషుల్లో దృష్టి లోపాన్ని నివారించే దిశగా, పక్షవాతం వంటి సమస్యల కారణంగా కదలికలు కోల్పోయినవారిలో మళ్లీ కదలికలు తీసుకువచ్చే దిశగా పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయన్నారు.

Musk develops chip to put in brain: వానరాల్లో విజయవంతం

ఇప్పటికే వానరాల్లో న్యూరాలింక్ చిప్ ను విజయవంతంగా అమర్చారు. దానికి సంబంధించిన వీడియోను మస్క్, న్యూరాలింక్ టీమ్ విడుదల చేశారు. మెదడులో చిప్ అమర్చిన కోతులు..చేతులు ఉపయోగించకుండా బేసిక్ వీడియో గేమ్స్ ఆడడం, స్క్రీన్ పై కర్సర్ ను కదిలించడం ఆ వీడియోలో కనిపించింది.