Elon Musk gives Twitter staff an ultimatum: ఉంటారా? వెళ్తారా? రేపటిలోగా చెప్పండి-elon musk gives twitter staff an ultimatum work long hours at high intensity or leave ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Elon Musk Gives Twitter Staff An Ultimatum: Work 'Long Hours At High Intensity' Or Leave

Elon Musk gives Twitter staff an ultimatum: ఉంటారా? వెళ్తారా? రేపటిలోగా చెప్పండి

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 09:51 PM IST

Elon Musk gives Twitter staff an ultimatum: ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తన ఉద్యోగులకు మరో అల్టిమేటం జారీ చేశారు. కఠిన పని వాతావరణంలో పని చేయలేమనుకుంటే, ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.

Elon Musk.
Elon Musk.

Elon Musk gives Twitter staff an ultimatum: ఇప్పటికే వరుస షాక్ లతో ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్.. తాజాగా మరో అల్టిమేటం ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Elon Musk gives Twitter staff an ultimatum: ఉంటారా? వెళ్తారా?

ట్విటర్ లో కొనసాగాలనుకుంటే కఠిన పని వాతావరణంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని, ఎక్కవ సమయం పని చేయాల్సి ఉంటుందని, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కండిషన్స్ లో పని చేసేందుకు అంగీకారమైతేనే, సంస్థలో కొనసాగాలని స్పష్టం చేశారు. లేదంటే ఉద్యోగం వదిలేయవచ్చని సూచించారు. ఈ కండిషన్స్ తో ఒక గూగుల్ ఫామ్ ను ఉద్యోగులకు పంపించారు. దాన్ని ఫిల్ చేసి, గురువారం సాయంత్రం 5 గంటలలోగా రిటర్న్ చేయాలని సూచించారు.

Elon Musk gives Twitter staff an ultimatum: ఇక ట్విటర్ 2.0

ప్రస్తుత పోటీ వాతావరణంలో విజయవంతంగా కొనసాగాలంటే, ఆదాయ మార్గాలను పెంచుకోవాలంటే ట్విటర్ 2.0 విధానాలను పాటించాల్సిందేనని మస్క్ తన ఉద్యోగులకు పంపిన ఒక ఈ మెయిల్ లో స్పష్టం చేశారు. ఎక్కువ పని గంటలు, కఠిన పని ఒత్తిడి ఉండే వాతావరణంలో పని చేస్తేనే అత్యుత్తమ ఫలితాలను రాబట్టగలమన్నారు. ట్విటర్ యాజమాన్య బాధ్యతలు చేపట్టగానే దాదాపు 50% ఉద్యోగులను మస్క్ తొలగించారు. వారిలో సీనియర్ కేటగిరీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మిగిలి ఉన్న ఉద్యోగులకు మస్క్ తాజా అల్టిమేటంను జారీ చేశారు.

WhatsApp channel