Elon Musk - PM Modi: ప్రధాని మోదీని ఫాలో అవడం ప్రారంభించిన మస్క్.. టెస్లా కార్లు ఇండియాకు రానున్నాయా?
Elon Musk Follows PM Modi: భారత ప్రధాని మోదీని ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్నారు. దీంతో టెస్లా కార్లు ఇండియాకు రానున్నాయా అంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు.
Elon Musk Follows PM Modi: ట్విట్టర్, టెస్లా సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఫాలో అవడం ప్రారంభించారు. ట్విట్టర్‌లో మోదీని మస్క్ ఫాలో అవడం మొదలుపెట్టారు. ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk) ఫాలో అవుతున్న 195 మంది జాబితాకు చెందిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్‌లో 134.3 మిలియన్ యూజర్లు మస్క్‌ను ఫాలో అవుతున్నారు. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ఎలాన్ ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో 87.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాగా, మోదీని మస్క్ ఫాలో అవడం ప్రారంభించారని తెలియటంతో కొత్త చర్చ మొదలైంది.
Elon Musk Follows PM Modi: ఎలాన్ మస్క్ ఫాలోవర్ అప్‍డేట్‍లను పోస్ట్ చేసే ఎలాన్ అలర్ట్స్ (Elon Alerts) అకౌంట్ నుంచి ఓ ట్వీట్ పోస్ట్ అయింది. నరేంద్ర మోదీని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్నారంటూ అందులో ఉంది. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టెస్లా ఇండియాకు వస్తోందా!
Elon Musk Follows PM Modi: ప్రధాని మోదీని మస్క్ ఫాలో అవడం ప్రారంభించటంతో నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. టెస్లా అతిత్వరలో ఇండియాకు వస్తుందనడానికి ఇది సంకేతంగా ఉందంటూ కొందరు అభిప్రాయపడ్డారు. టెస్లా కార్లు భారత్‍కు వచ్చేస్తున్నాయా అంటూ ట్వీట్ల్ చేస్తున్నారు.
“నరేంద్ర మోదీని మస్క్ ఫాలో అయ్యేందుకు ఏ కారణం ఉంది? ఇక్కడ (ఇండియా) టెస్లా ఫ్యాక్టరీని మనం అంచనా వేయవచ్చు” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. టెస్లా కార్లు త్వరలోనే ఇండియాకు వచ్చేలా కనిపిస్తున్నాయంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. కాగా, మోదీ ప్రపంచ నాయకుడు అని, అందుకే మస్క్ కూడా ఫాలో అవడం మొదలుపెట్టారని మరికొందరు ట్వీట్లు చేశారు.
Elon Musk Follows PM Modi: టెస్లా కార్లను ఇండియాకు దిగుమతి చేసి విక్రయించేందుకు ఎలాన్ మస్క్ గతంలో ప్రయత్నించారు. అయితే ఇండియాలో అధిక పన్నులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. వెనక్కి తగ్గారు. దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అయితే అది జరగలేదు.
బీబీసీకి లేబుల్ ఇచ్చిన రోజే..
Elon Musk Follows PM Modi: కాగా, బీబీసీ ట్విట్టర్ ఖాతాకు గవర్నమెంట్ ఫండెండ్ మీడియా అనే లేబుల్ ఇచ్చిన తర్వాత భారత ప్రధాని మోదీని మస్క్ ఫాలో కావడం కూడా ఆసక్తికరంగా మారింది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎంతో దుమారం రేపింది. ఈ తరుణంలో బీబీసీకి లేబుల్ ఇచ్చిన రోజే.. మోదీని మస్క్ ఫాలో కావడం ప్రారంభించారు. “బీబీసీకి గవర్నమెంట్ ఫండెడ్ మీడియా అని ట్విట్టర్ లేబుల్ ఇచ్చింది. ఎలాన్ మస్క్ నరేంద్ర మోదీని ఫాలో అయ్యారు. ఈ రెండూ ఒకే రోజులో జరిగాయి” అని అగ్రగామి అనే యూజర్ ట్వీట్ చేశారు.
గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కైవసం చేసుకున్నారు ఎలాన్ మస్క్. అప్పటి నుంచి సంస్థలో ఉద్యోగుల తొలగింపుతో పాటు చాలా మార్పులను తీసుకొచ్చారు. తాజాగా ట్విట్టర్ పేరులో Wను తొలగించే దిశగా ఆలోచిస్తున్నారు.
సంబంధిత కథనం