Elon Musk comments on EVM : ఈవీఎంలపై టెస్లా సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈవీఎంలను వాడకూడదని మస్క్ అన్న మాటలకు.. బీజేపీ నేత ఒకరు కౌంటర్ ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వార్తలకెక్కింది. ఈ పూర్తి వ్యవహారంపై రాహుల్ గాంధీ సైతం స్పందించారు.
"ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లను ఎలిమినేట్ చేసేయాలి. మనుషులు, ఏఐ.. ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం తక్కువగా ఉన్నా, అది చాలా రిస్కీ," అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు మస్క్.
మస్క్ ట్వీట్‌పై బీజేపీ నేత, ఎలక్ట్రానిక్స్- ఐటీశాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
"ఇవి చాలా సాధారణమైన వ్యాఖ్యలు. సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ని సృష్టించగలిగే అవకాశాన్ని ఈ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నాయి. తప్పు!" అన్నట్టు వ్యాఖ్యానించారు చంద్రశేఖర్.
Elon Musk vs BJP : స్టాండర్డ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌లను వాడి ఈవీఎంలను రూపొందించే దేశాలకు.. మస్క్ ఆరోపణలు వర్తిస్తాయని, అవి ఇండియాకు వర్తించవని బీజేపీ నేత అన్నారు.
"ఇండియాలో ఈవీఎంలు కస్టమ్ డిజైన్. చాలా భద్రంగా ఉంటాయి. కనెక్టివిటీ, బ్లూటూత్, ఇంటర్నెట్లు హ్యాక్ చేయలేవు," అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
"ఇండియా చేసినట్టు.. ఈవీఎంలను సరైన విధంగా, సెక్యూర్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలాన్‌కి ఈ విషయంలో పాఠాలు చెప్పడాన్ని సంతోషిస్తా," అన్నారు బీజేపీ నేత.
అయితే.. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై స్పందించిన ఎలాన్ మస్క్.. "దేనినైనా హ్యాక్ చేసేయొచ్చు," అని అన్నారు.
Rahul Gandhi EVM : ఈవీఎంలు హ్యాకింగ్‌కి గురవుతున్నాయని విపక్షాలు ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ఎలాన్ మస్క్ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
"ఇండియాలో ఈవీఎంలను బ్లాక్ బాక్స్‌గా పరిగణిస్తున్నారు. వాటిపై ఎవరికి మాట్లాడే హక్కు లేదు! మన ఎన్నికల పారదర్శకతపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవస్థలు జవాబుదారీతనంతో లేకపోతే.. ప్రజాస్వామ్యం మోసానికి గురవుతుంది," అని అన్నారు రాహుల్ గాంధీ. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ సీటు గెలిచిన అభ్యర్థి వద్ద.. ఈవీఎంలకు కనెక్ట్ చేసి ఉన్న ఫోన్ ఉందన్న ఓ వార్తను తన ట్వీట్‌కు జోడించారు కాంగ్రెస్ సీనియర్ నేత.
Can EVM be hacked : ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో.. ముంబై నార్త్ వెస్ట్ సీట్‌ని 48 ఓట్ల తేడాతో గెలిచారు రవీంద్ర వైకర్. కాగా.. వైకర్ బావమరిది.. జూన్ 4న ఓ పోలింగ్ బూత్ వద్ద ఫోన్ వాడుతూ కనిపించారు. ఆయనపై కేసు నమోదైంది. కాగా.. నెస్కో సెటర్ వద్ద.. ఈవీఎంలను అన్‌లాక్ చేసేందకు ఉపయోపడే ఓటీపీ.. ఆ ఫోన్లో ఉందని ఆరోపణలు వచ్చాయి. సంబంధిత ఫోన్‌ని ఫోరెన్సీక్ పరీక్షల కోసం పంపించార. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఏది ఏమైనా.. ఈ ఈవీఎంల హ్యాకింగ్ వ్యవహారం నిత్యం వార్తల్లో ఉంటోంది.
సంబంధిత కథనం