Elon Musk: మస్క్‌కు షాక్.. ప్రపంచ కుబేరుడి స్థానం నుండి డౌన్.. ఫస్ట్ ఎవరంటే..
Elon Musk loses world richest person title: ప్రపంచ అత్యంత ధనికుడి బిరుదును ఎలాన్ మస్క్ ఇప్పటికి కోల్పోయారు. స్వల్ప తేడాతో ప్రస్తుతం ఆయన రెండో స్థానానికి పడిపోయారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రస్తుతం టాప్‍లోకి ఎవరు వచ్చారంటే..
Elon Musk loses world richest person title: టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. స్వల్ప తేడాతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని కోల్పోయి.. రెండో ప్లేస్‍కు వచ్చారు. ప్రపంచ బిలీనియర్ల సంపదను ట్రాక్ చేసే ఫోర్బ్స్ (Forbes) జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ప్రస్తుత స్వల్ప తేడాతో రెండో స్థానంలోకి పడిపోయిన మస్క్.. మళ్లీ టాప్‍కు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ప్రస్తుతం ప్రపంచ అత్యంత ధనిక స్థానానికి ఎవరు వచ్చారు.. మస్క్ సంపద తగ్గేందుకు కారణాలు ఏంటి.. అనే వివరాలను ఇక్కడ చూడండి.
టాప్‍లోకి వచ్చిన అర్నాల్ట్
Elon Musk loses world richest person title: ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం… లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టోన్ పేరెంట్ కంపెనీ ఎల్‍వీఎంహెచ్ (LVMH) సీఈవో ‘బెర్నార్డ్ అర్నాల్ట్’ (Bernard Arnault), ఆయన కుటుంబం ప్రపంచ అత్యంత ధనవంత జాబితాలో అగ్రస్థానానికి వచ్చారు. ఎలాన్ మస్క్ ను రెండో స్థానానికి నెట్టారు. ఎలాన్ మస్క్ సంపద విలువ 185.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అర్నాల్ట్ సంపద 185.7 బిలియన్ డాలర్లు చేరి.. ప్రపంచ కుబేరుడి స్థానానికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య ప్రస్తుతం వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఈ స్థానాలు క్రమంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి.
మస్క్ సంపద ఎందుకు తగ్గింది?
Elon Musk loses world richest person title: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla) షేర్లు తీవ్రంగా పడిపోవడం వల్ల ఎలాన్ మస్క్ సంపద ఈ ఏడాది నవంబర్ లో 200 బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయింది. చైనాలో కొవిడ్ ఆంక్షలు ఉండటంతో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అమ్మకాలకు మరిన్ని కష్టాలు వచ్చాయి. రెండు సంత్సరాల కనిష్ఠం వద్ద టెస్లా షేర్లు ఉన్నాయి. ఇది మస్క్ సంపదపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మరోవైపు, 44 బిలియన్ డాలర్లకు మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా నెట్‍వర్క్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఆ సంస్థలో చాలా అనిశ్చితి ఉంది. ప్రస్తుతం ట్విట్టర్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని సమాచారం.
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‍ను వెనక్కి నెట్టి సెప్టెంబర్ 2021లో ప్రపంచ అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ అవతరించారు. అయితే ఇప్పుడు స్పల్ప తేడాతో రెండో స్థానానికి పడిపోయారు. మళ్లీ టాప్‍కు వస్తారేమో చూడాలి.