Gujarat assembly elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యులు నేడే-election commission of india set to announce gujarat poll dates today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Election Commission Of India Set To Announce Gujarat Poll Dates Today

Gujarat assembly elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యులు నేడే

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 09:31 AM IST

Gujarat assembly elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యులు నేడు వెలువడే అవకాశం ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం
కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం (HT_PRINT)

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించే అవకాశం ఉంది. పోలింగ్ రెండు దశల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

182 నియోజకవర్గాలు ఉన్న గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్క్ 92 సీట్లు అవసరం. అధికారంలో ఉన్న బీజేపీ 2017లో 99 స్థానాలను గెలుచుకుంది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరిలో ముగియనుంది.

హిమాచల్ ప్రదేశ్‌కు నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది. హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 25 కాగా ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 29.

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ పదవీకాలం 8 జనవరి 2023న ముగుస్తుంది. E రాష్ట్రంలో 68 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉంది.

కాగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపకపోవడంపై విపక్షాలు మండిప్డాయి. అయితే రాష్ట్రాలు భౌగోళికంగా పరస్పరం సంబంధం లేనివని, గతంలో నిర్వహించిన షెడ్యూలుకు అనుగుణంగా ఈ షెడ్యూలు ఉందని కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ‘రెండు రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి మధ్య 40 రోజుల గ్యాప్ ఉంది. నిబంధనల ప్రకారం ఒక ఫలితం మరొకదానిపై ప్రభావం చూపకుండా ఉండటానికి కనీసం 30 రోజులు ఉండాలి..’ అని హిమాచల్ ఎన్నికలను ప్రకటించడానికి మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు.

అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాష్ట్ర ప్రజలకు ముందస్తు ఎన్నికల వరాలు ప్రకటించడానికి తగిన అవకాశం ఇచ్చేందుకే గుజరాత్ తేదీలను ప్రకటించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ జాతీయ కమ్యూనికేషన్ ఇన్‌చార్జి జైరాం రమేష్ ఈ విషయంలో ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘మెగా వాగ్దానాలు, ప్రారంభోత్సవాలు’ చేయడానికి ఎక్కువ సమయం పొందారని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనప్పుడు తాము ఆశ్చర్య పోలేదని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point