5 states election 2023 : నవంబర్ 7 నుంచి 30 వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు
5 states election 2023 : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఆ వివరాలు..
5 states election schedule 2023 : దేశంలో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించింది ఈసీ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే..
తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నవంబర్ 7 నుంచి నవంబర్ 30 మధ్యలో పోలింగ్ జరుగుతుంది.
- మిజోరంలో నవంబర్ 7న ఒక దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది.
- ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ తేదీ నవంబర్ 7గా ఉండగా.. రెండో దశ తేదీ నవంబర్ 17గా ఉంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.
- Telangana Assembly election date : మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటిస్తుంది ఈసీ.
- రాజస్థాన్‌లో నవంబర్ 23న పోలింగ్ ఉంటుంది. ఫలితాలు డిసెంబర్ 3న బయటకు వస్తాయి.
- తెలంగాణలో నవంబర్ 30న ఒక దశలో పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలతో కలిపి.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.
5 రాష్ట్రాల్లో 1.77లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ 1.77లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17,734 మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయని, 621 పోలింగ్ కేంద్రాలను పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహిస్తారని స్పష్టం చేసింది. ఈసారి.. 5 రాష్ట్రాల్లో దాదాపు 60లక్షల మంది తొలిసారి ఓటు హక్కు సాధించారని తెలిపింది. మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 16కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
ప్రస్తుత రాజకీయ సమీకరణలు..
Telangana assembly election results : తెలంగాణలో మొత్తం 119 సీట్లు ఉండగా.. మెజారిటీ సాధించాలంటే 60 స్థానాల్లో గెలవాల్సిందే. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్‌కు 19 సీట్లు దక్కాయి. బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది.
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ వచ్చేసి 46. 2018లో.. 68 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని స్థాపించింది. బీజేపీకి 15 సీట్లే వచ్చాయి!
రాజస్థాన్‌లో.. 2018లో అప్పటివరకు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది కాంగ్రెస్. 200 సీట్ల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ పొందాలంటే 101 స్థానాల్లో గెలవాల్సి ఉంది. నాటి ఎన్నికల్లో ఏకంగా 108 సీట్లు సాధించింది కాంగ్రెస్. బీజేపీకి 73 సీట్లే వచ్చాయి.
Madhya Pradesh Assembly election date : మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 116 మ్యాజిక్ ఫిగర్. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 114 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్. బీజేపీకి 109 స్థానాలే దక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్నిస్థాపించినా.. నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది.
ఈశాన్య భారత దేశంలో భాగమైన మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 21. 2018 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో.. ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మొత్తం 26 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 చోట్లే ఖాతా తెరవగలిగింది.
సంబంధిత కథనం