ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఉన్న ఒక పాఠశాలలో ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారని, పలువురు గాయపడ్డారని టాబ్లాయిడ్ క్రోనెన్ జీటుంగ్ సహా ఆస్ట్రియన్ మీడియా మంగళవారం తెలిపింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ ఆస్ట్రియా ప్రభుత్వ మీడియా ఓఆర్ఎఫ్ తెలిపింది. కాల్పులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న విద్యార్థి చివరకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానిక పోలీసులను ఉటంకిస్తూ మీడియా వెల్లడించింది.
కాల్పుల సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇతర అధికారులు ఇతర విద్యార్థులు, టీచర్లు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఉదయం 10 గంటలకు అత్యవసర కాల్ రావడంతో ప్రత్యేక బలగాలు హుటాహుటిన కాల్పుల ఘటన చోటు చేసుకున్న బిఓఆర్ జి డ్రీయర్స్ షెట్జెంగాస్ హైస్కూల్ కు చేరుకున్నాయి. సుమారు గంట తర్వాత సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు సోషల్ నెట్ వర్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సంబంధిత కథనం