Kolkata Gaming app scam: రూ. 17 కోట్లు.. స్టిల్ కౌంటింగ్!-ed seizes rs 7 cr after raids on kolkata based gaming app operators ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ed Seizes <Span Class='webrupee'>₹</span>7 Cr After Raids On Kolkata-based Gaming App Operators

Kolkata Gaming app scam: రూ. 17 కోట్లు.. స్టిల్ కౌంటింగ్!

HT Telugu Desk HT Telugu
Sep 10, 2022 07:13 PM IST

Kolkata Gaming app scam: గేమింగ్ యాప్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. కోల్ కతా కు చెందిన ఈ గేమ్ ఆపరేటర్స్ కార్యాలయాల్లో శనివారం ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు
ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు

Kolkata Gaming app scam: ఈ నగ్గెట్స్..

నగదు అక్రమ చెలామణి కేసుకు సంబంధించి కోల్ కతాలోని ఒక సంస్థ కార్యాలయాల్లో ఈడీ శనివారం సోదాలు నిర్వహించింది. ‘ఈ నగ్గెట్స్’ అనే గేమింగ్ యాప్ ఆపరేటర్ల కు సంబంధించిన సంస్థ అది. ఆ సంస్థ కార్యాలయాలు, దాని ప్రమోటర్ల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. సోదాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు లెక్క తెలియని రూ. 17 కోట్లకు పైబడి నగదును స్వాధీనం చేసుకున్నామని ఈడీ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Kolkata Gaming app scam: నోట్ల కట్టలు..

స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి ఒక ఫొటోను కూడా ఈడీ విడుదల చేసింది. ఒక బెడ్ పై రూ. 500, రూ. 2000, రూ. 200 నోట్ల కట్టలను పేర్చిన ఫొటోను ఈడీ విడుదల చేసింది. ఈ నగ్గెట్స్ గేమింగ్ యాప్ ఆపరేటర్లుగా ఆమిర్ ఖాన్, మరి కొందరు వ్యవహరిస్తున్నారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల సమయంలో ఈ నగదు లభ్యమైంది. మనీ కౌంటింగ్ మెషీన్ల సాయంతో ఆ నగదును లెక్కిస్తున్నారు. ఆ నగదును తరలించడానికి ట్రక్స్ ను సిద్ధం చేశారు.

Kolkata Gaming app scam: స్కామ్ ఏంటి?

ఈ నగ్గెట్స్` అనే గేమింగ్ యాప్ కు సంబంధించిన కుంభకోణం ఇది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత కొంత డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గేమింగ్ ప్రాసెస్ లో రివార్డ్ ల పేరుతో గెల్చుకున్న డబ్బును మొదట్లో వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఎంత ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తంలో రివార్డ్స్ ఇవ్వడం ప్రారంభించారు. దాంతో, యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించారు. క్రమంగా ఆపరేటర్లు డబ్బు విత్ డ్రా పై ఆంక్షలు విధించడం ప్రారంభించారు. తరువాత, మొత్తంగా ఆ అవకాశం నిలిపేసి, మొత్తం యూజర్ డేటాను డిలీట్ చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

Kolkata Gaming app scam: టీఎంసీకి సంబంధం లేదు..

ఈ స్కామ్ కు అధికార టీఎంసీకి సంబంధం లేదని టీఎంసీ మంత్రి ఫర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు. అక్రమ నగదు పై దర్యాప్తు సాగాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే, కేవలం బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

IPL_Entry_Point