ED News | ఆ ఇంట్లో రూ. 20 కోట్ల న‌గ‌దు-ed seizes rs 20 cr cash after raids on wb minister partha chatterjee s aide ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ed Seizes <Span Class='webrupee'>₹</span>20 Cr Cash After Raids On Wb Minister Partha Chatterjee's Aide

ED News | ఆ ఇంట్లో రూ. 20 కోట్ల న‌గ‌దు

HT Telugu Desk HT Telugu
Jul 23, 2022 12:45 AM IST

ED seizes ₹20 cr cash : క‌ట్ట‌లు, క‌ట్ట‌లుగా న‌గ‌దు. ఒక‌టి, రెండు కాదు ఏకంగా 20 కోట్ల రూపాయ‌లు. ఒక నాయ‌కుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(Enforcement Directorate) అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం. ఈ అక్ర‌మ న‌గ‌దును లెక్కించ‌డానికే అధికారుల‌కు ఒక రోజుకు పైగా స‌మ‌యం ప‌ట్టింది.

ఈడీ సోదాల్లో ల‌భించిన డ‌బ్బు క‌ట్ట‌లు
ఈడీ సోదాల్లో ల‌భించిన డ‌బ్బు క‌ట్ట‌లు

ED seizes 20 cr cash : ప‌శ్చిమ బెంగాల్‌లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుడి ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్న న‌గ‌దు మొత్తాన్ని చూసి అధికారులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ నాయ‌కుడు రాష్ట్రంలో జ‌రిగిన SSC scam case లో నిందితుడు.

ట్రెండింగ్ వార్తలు

ED seizes 20 cr cash : క‌ట్ట‌లుక‌ట్ట‌లుగా..

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు పార్థ చ‌ట‌ర్జీతో స‌న్నిహిత సంబంధాలున్న‌ అర్పిత ముఖర్జీకి చెందిన ఇళ్లు, కార్యాల‌యాల్లో శుక్ర‌వారం Enforcement Directorate సోదాలు నిర్వ‌హించింది. ఆ త‌నిఖీల్లో వారికి క‌ళ్లు చెదిరే మొత్తంలో న‌గ‌దు క‌నిపించింది. దాదాపు రూ. 20 కోట్ల‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. పశ్చిమ‌ బెంగాల్ రాష్ట్ర స్కూల్ స‌ర్వీస్ క‌మిష‌న్ (West Bengal School Service Commission ), రాష్ట్ర ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్ బోర్డ్ (West Bengal Primary Education Board)ల్లో నియామ‌కాల్లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన కేసు విచార‌ణ‌లో భాగంగా ఈడీ ఈ సోదాలు నిర్వ‌హించింది.

ED seizes 20 cr cash : ఆ స్కామ్‌కు సంబంధించిన డ‌బ్బులే అవి

ప‌శ్చిమ‌బెంగాల్‌మంత్రి పార్థ చ‌ట‌ర్జీతో స‌న్నిహిత సంబంధాలున్న‌ అర్పిత ముఖ‌ర్జీ ఇళ్లు, కార్యాల‌యాల్లో ల‌భించిన న‌గ‌దు మొత్తం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన ఎస్ఎస్‌సీ స్కామ్‌కు సంబంధించిన‌విగా భావిస్తున్నామ‌ని ఈడీ ప్ర‌క‌టించింది. రూ. 500, రూ. 200 నోట్ల క‌ట్ట‌లున్న ఆ న‌గ‌దు మొత్తాన్ని లెక్కించ‌డానికి ఈడీ అధికారులు కౌంటింగ్ మెషీన్లు, బ్యాంక్ అధికారుల సాయం తీసుకుంటున్నారు. ఈ న‌గ‌దుతో పాటు దాదాపు 15 ఫోన్ల‌ను, కొన్ని డాక్యుమెంట్ల‌ను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. డొల్ల కంపెనీల వివ‌రాలున్న కొన్ని ప‌త్రాల‌ను కూడా ఈడీ సేక‌రించింది. అలాగే, బంగారు ఆభ‌ర‌ణాలు, విదేశీ క‌రెన్సీని కూడా వారు గుర్తించారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ ఇప్ప‌టికే పార్థ చ‌ట‌ర్జీని, మ‌రో మంత్రి ప‌రేశ్ అధికారితో పాటు విద్యా శాఖ‌లోని ప‌లువురు సీనియ‌ర్ అధికారుల‌ను ప్ర‌శ్నించింది.

IPL_Entry_Point