ED finds black diary | ఆ `బ్లాక్ డైరీ`లో ఏముంది?-ed finds black diary with explosive details at partha chatterjee s aide s residence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ed Finds Black Diary With Explosive Details At Partha Chatterjee's Aide's Residence

ED finds black diary | ఆ `బ్లాక్ డైరీ`లో ఏముంది?

HT Telugu Desk HT Telugu
Jul 26, 2022 11:18 PM IST

black diary | ప‌శ్చిమబెంగాల్ SSC scam లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డ‌వుతున్నాయి. రాష్ట్ర మంత్రి పార్థ చ‌ట‌ర్జీ కి అత్యంత స‌న్నిహితురాలైన అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో రెండు రోజుల క్రితం రూ. 20 కోట్ల న‌గ‌దును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, మ‌రో సంచ‌ల‌న విష‌యాన్ని ఈడీ వెల్ల‌డించింది.

అర్పిత ముఖర్జీ
అర్పిత ముఖర్జీ

black diary | ల్‌క‌తాలోని అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ జ‌రిపిన సోదాల్లో భారీ ఎత్తున న‌గ‌దు, ఆభ‌ర‌ణాలు, స్థిరాస్తుల‌కు సంబంధించిన ప‌త్రాలు ల‌భించాయి. వాటితో పాటు మ‌రో కీల‌క ఆధారం కూడా ఈడీ అధికారుల‌కు ల‌భించింది.

ట్రెండింగ్ వార్తలు

black diary | బ్లాక్ డైరీ సీక్రెట్స్‌..

అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో ఒక న‌లుపు రంగు డైరీ(black diary) త‌మ‌కు ల‌భించింద‌ని ఈడీ తాజాగా వెల్ల‌డించింది. అందులో సంచ‌ల‌నాత్మ‌క ర‌హ‌స్యాలు ఉన్న‌ట్లు స‌మాచారం. రాష్ట్ర రాజ‌కీయాల్లో భూకంపం తెప్పించే స‌మాచారం ఆ డైరీలో ఉన్న‌ట్లు ఈడీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ఎస్‌సీ స్కామ్ ద్వారా వ‌చ్చిన మొత్తం, అందులో వాటాదార్ల వివ‌రాలు ఆ డైరీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వంలోని ప‌లువురు పెద్ద‌లు ఈ స్కామ్ ద్వారా పెద్ద ఎత్తున సంపాదించార‌ని తెలుస్తోంది. ప్రాథ‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల నియామ‌కానికి సంబంధించిన SSC ప‌రీక్ష‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల వివ‌రాలు ఆ డైరీలో వివ‌రంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

black diary | ఆ 40 పేజీలు..

పార్థ చ‌ట‌ర్జీ ప‌శ్చిమ బెంగాల్ వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి. ఆయ‌నకు అర్పిత ముఖ‌ర్జీ అత్యంత స‌న్నిహితురాలు. ఆమె ఇంట్లోనే చాలా సెటిల్‌మెంట్స్ జ‌రిగేవ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో ఈడీ అధికారుల‌కు ల‌భించిన బ్లాక్ డైరీలో SSC ఎగ్జామ్ స్కామ్‌కు సంబంధించిన అన్ని వివ‌రాల‌తో పాటు, ఇత‌ర స‌మాచారం కూడా ఉంద‌ని ఈడీ వ‌ర్గాలు తెలిపాయి. SSC ఎగ్జామ్ స్కామ్ కేసులో పార్థ చ‌ట‌ర్జీ ని జులై 23న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

IPL_Entry_Point