Jet Airways : జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు నరేశ్​ గోయల్​ అరెస్ట్​!-ed arrests jet airways founder naresh goyal in bank fraud case in mumbai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jet Airways : జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు నరేశ్​ గోయల్​ అరెస్ట్​!

Jet Airways : జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు నరేశ్​ గోయల్​ అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Sep 02, 2023 06:17 AM IST

Jet Airways : జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు నరేశ్​ గోయల్​ అరెస్ట్​ అయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని ఈడీ అరెస్ట్​ చేసింది.

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థపకుడు అరెస్ట్​..
జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థపకుడు అరెస్ట్​.. (HT_PRINT)

Jet Airways news : ప్రముఖ విమానయాన సంస్థ జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు నరేశ్​ గోయల్​ను ఈడీ అరెస్ట్​ చేసింది. రూ. 538 కోట్ల మనీ లాండరింగ్​ కేసులో భాగంగా శుక్రవారం రాత్రి ఈ చర్యలు చేపట్టింది.

శుక్రవారం.. ముంబైలోని ఈడీ కార్యాలయంలో నరేశ్​ గోయల్​ను సుదీర్ఘంగా విచారించిన అనంతరం పీఎంఎల్​ఏ చట్టం కింద ఆయన్ని అరెస్ట్​ చేసింది ఈడీ. కస్టడీ కోసం నరేశ్​ గోయల్​ను శనివారం నాడు.. స్పెషల్​ పీఎంఎల్​ఏ కోర్టు ఎదుట హాజరుపరచనుంది.

కెనరా బ్యాంక్​కు సంబంధించిన రూ. 538 కోట్ల ఫ్రాడ్​ కేసుపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా విచారణ జరిపింది ఈడీ. నరేశ్​ గోయల్​, ఆయన భార్య అనితలు తమను మోసం చేసినట్టు సంబంధిత బ్యాంక్​ ఫిర్యాదు చేసింది. వీరికి రూ. 848.86 కోట్లు విలువ చేసే రుణాలు ఇచ్చినట్టు, వీటిల్లో రూ. 538.62 కోట్లు ఔట్​స్టాండింగ్​ లోన్స్​ అన్నట్టు వెల్లడించింది.

Naresh Goyal arrest : నరేశ్​ గోయల్​, ఆయన సతీమణి బ్యాంక్​ మోసానికి పాల్పడినట్టు 2021లో సీబీఐ నిర్ధరించింది. సంస్థ అప్పులున్న వారికి రూ. 1,410.41 కోట్లను తిరిగి ఇచ్చేసినట్టు జేఐఎల్​ ఫోరెన్సీక్​ ఆడిట్​ చెబుతోందని, కానీ ఆ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ గోయల్​ కుటుంబం ఫోన్​ బిల్స్​, ఖర్చులు, సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు వాడినట్టు ఈ వ్యవహారంపై ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. జెట్​ ఎయిర్​వేస్​ సబ్సిడరీ అయిన జెట్​ లైట్​ లిమిటెడ్​ నుంచి కూడా నిధులు మాయమైనట్టు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం