Viral: దొరికిన రూ.25లక్షలు ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. నిజాయితీకి సలామ్ అంటూ..-e rickshaw driver returns bag with 25 lakh rupees to police netizens praise his honesty ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  E Rickshaw Driver Returns Bag With 25 Lakh Rupees To Police Netizens Praise His Honesty

Viral: దొరికిన రూ.25లక్షలు ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. నిజాయితీకి సలామ్ అంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 09, 2023 03:59 PM IST

E-Rickshaw driver returns ₹25 lakh: ఓ ఈ-ఆటో రిక్షా డ్రైవర్ తనకు దొరికిన రూ.25లక్షలకు పోలీసులకు అప్పగించారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్‍గా మారింది. పూర్తి వివరాలివే..

Viral: దొరికిన రూ.25లక్షలు ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. నిజాయితీకి సలామ్ అంటూ.. (Photo: @DCPRuralGZB)
Viral: దొరికిన రూ.25లక్షలు ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. నిజాయితీకి సలామ్ అంటూ.. (Photo: @DCPRuralGZB)

E-Rickshaw driver returns 25 lakh: ఓ ఈ- ఆటో రిక్షా డ్రైవర్ అమితమైన నిజాయితీ చూపారు. తనకు దొరికిన రూ.25లక్షలను ఏ మాత్రం ఆశించకుండా పోలీసులకు అప్పగించేశారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఇది వైరల్ అయింది. నెటిజన్లు ఆ ఈ-రిక్షా డ్రైవర్‌ను ప్రశంసిస్తున్నారు. అతడి నిజాయితీకి సలామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‍(Uttar Pradesh) లోని ఘజియాబాద్‍(Ghaziabad) లో ఇది జరిగింది. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

రోడ్డు పక్కన..

E-Rickshaw driver returns 25 lakh: ఘజియాబాద్‍లో ఆటో నడుపుతూ జీవిస్తున్నారు అయాజ్ మహమ్మద్. రోజూలాగేనే మంగళవారం కూడా ప్రయాణికులను ఎక్కించుకొని ఆటో నడిపారు. అయితే ఈ క్రమంలో మోదీనగర్‌(Modinagar)లో ప్రయాణికుల కోసం కాసేపు ఆగారు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనపడింది. అది ఎవరిదోనని ఆయన చుట్టుపక్కల చూశారు. ఎవరూ కనిపించలేదు. అక్కడి వారిని అడిగినా ఆ బ్యాగ్ తమది కాదని చెప్పారు.

E-Rickshaw driver returns 25 lakh: దీంతో బ్యాక్ తీసుకొని ఘజియాబాద్‍లోని మోదీనగర్ పోలీస్ స్టేషన్‍కు వెళ్లారు మహమ్మద్. ఆ బ్యాగ్‍ను అక్కడి పోలీసులకు అప్పగించారు. ఆ బ్యాగ్‍లో అన్నీ రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. ఆ మొత్తం రూ.25లక్షల డబ్బు ఉంది. ఆ మొత్తాన్ని ఆ డ్రైవర్.. పోలీసులకు ఇచ్చేశారు.

డీసీపీ ప్రశంస

E-Rickshaw driver returns 25 lakh: రూ.25లక్షల డబ్బు ఉన్న బ్యాగ్‍ను నిజాయితీతో పోలీసులకు అప్పగించిన ఈ-రిక్షా డ్రైవర్ మహమ్మద్‍ను ఘజియాబాద్ కమిషనరేట్ రూరల్ డీసీపీ అభినందించారు. ఓ సర్టిఫికేట్ అందజేశారు.

“నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఓ ఈ-రిక్షా డ్రైవర్‌ను రూరల్ డీసీపీ అభినందించారు. డబ్బుతో నిండుగా ఉన్న రోడ్డు సైడ్ దొరికిన బ్యాగ్‍ను ఆ డ్రైవర్.. పోలీసులకు అప్పగించారు. నిజాయితీని చాటుకున్నారు” అని కమిషనరేట్ కార్యాలయం ట్వీట్ చేసింది. డ్రైవర్ మహమ్మద్‍కు డీసీపీ.. బొకే, సర్టిఫికేట్ అందిస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది.

E-Rickshaw driver returns 25 lakh: నిజాయితీ ప్రదర్శించిన ఈ-ఆటో రిక్షా డ్రైవర్‌ను నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజాయితీకి సలామ్ అంటూ కొందరు కామెంట్లు చేశారు.

గతేడాది ఇలాంటి ఘటనే జరిగింది. తన ఆటోలో ఓ వ్యక్తి రూ.6లక్షల విలువైన బంగారు ఆభరణాలు మరిచిపోగా.. ఆ డ్రైవర్ వారికి అప్పగించారు.

IPL_Entry_Point