DVC Recruitment 2024: డీవీసీ లో జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్-dvc recruitment 2024 apply for 66 je and executive trainee posts link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dvc Recruitment 2024: డీవీసీ లో జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

DVC Recruitment 2024: డీవీసీ లో జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jun 11, 2024 09:32 PM IST

DVC Recruitment 2024: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డీవీసీ అధికారిక వెబ్ సైట్ dvc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జులై 4.

డీవీసీ లో జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ
డీవీసీ లో జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ

DVC Recruitment 2024: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డీవీసీ అధికారిక వెబ్సైట్ dvc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 66 జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

yearly horoscope entry point

లాస్ట్ డేట్ జులై 4

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 4 జూలై 2024. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

ఖాళీల వివరాలు

  • జేఈ గ్రేడ్ 2 (మెకానికల్): 16 పోస్టులు
  • జేఈ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్): 20 పోస్టులు
  • జేఈ గ్రేడ్-2 (కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్): 2 పోస్టులు.
  • జేఈ గ్రేడ్-2 (సివిల్): 20 పోస్టులు
  • జేఈ గ్రేడ్-2 (కమ్యూనికేషన్స్): 2 పోస్టులు
  • మైన్ సర్వేయర్: 4 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సాయిల్): 2 పోస్టులు.

ఎంపిక ప్రక్రియ

అర్హులైన అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ రిటెన్ టెస్ట్. ఈ పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. వీరి జాబితాను వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు

జనరల్/ ఓబీసీ(ఎన్సీఎల్)/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-ఎస్ఎం కేటగిరీలు, డీవీసీ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎలా అప్లై చేయాలి

  • డీవీసీ అధికారిక వెబ్ సైట్ dvc.gov.in ను ఓపెన్ చేయండి.
  • కెరీర్స్ పేజీపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • పేజీలో అందుబాటులో ఉన్న జేఈ అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లింక్ పై క్లిక్ చేయండి.
  • అప్లై లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.