DU Faculty Recruitment 2023 : డీయూలో 225 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా-du faculty recruitment 2023 jmc to recruit 145 assistant professor posts see full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Du Faculty Recruitment 2023: Jmc To Recruit 145 Assistant Professor Posts See Full Details

DU Faculty Recruitment 2023 : డీయూలో 225 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 20, 2022 10:36 AM IST

DU Faculty Recruitment 2023 : ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రెండు కాలేజ్​లలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగాల నోటిఫికేషన్​ పడింది. ఆ వివరాలు..

డీయూలో 225 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా
డీయూలో 225 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా

DU Faculty Recruitment 2023 : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జేఎంసీ(జీసెస్​ అండ్​ మేరీ కాలేజ్​)లో ఫాకల్టీ పోస్టుల రిక్రూట్​మెంట్​ ప్రక్రియ మొదలైంది. జేఎంసీ అధికారిక వెబ్​సైట్​ అయిన jmc.ac.in లో.. అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ప్రక్రియ 2023 జనవరి 7న ముగుస్తుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

జేఎంసీలోని మొత్తం 145 పోస్టులకు రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ జరుగుతోంది. అర్హతతో పాటు సెలక్షన్​ ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి.

అర్హత..

JMC recruitment 2023 : అభ్యర్థులకు భారత విశ్వవిద్యాలయాలు లేదా అక్రిడేటెడ్​ ఫారిన్​ యూనివర్సిటీల్లో 55శాతం మార్కులతో మాస్టర్స్​ డిగ్రీ ఉండాలి. లేదా.. ప్రపంచంలోని టాప్​ 500 యూనివర్సిటీల్లోని ఇన్​స్టిట్యూషన్​ నుంచి పీహెచ్​.డీ ఉండాలి.

అసిస్టెంట్​ ప్రొఫెసర్​ నియామకాల్లో నేషనల్​ ఎలిజిబులిటీ టెస్ట్​ అనేది కనీస అర్హతగా ఉంటుంది. అయితే.. ఎన్​ఈటీ నిర్వహించని సబ్జెక్టులకు మినహాయింపు లభిస్తుంది.

సెలక్షన్​ ప్రక్రియ..

అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్​ కమిటీ పరిశీలిస్తుంది. ఎక్కువ మార్కులు మొదలుకుని.. తక్కువ మార్కుల వరకు ఓ లిస్ట్​ తయారు చేస్తుంది. వాటిల్లో నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికే ఉద్యోగం లభిస్తుంది.

అప్లికేషన్​ ఫీజు..

దరఖాస్తు కోసం యూఆర్​/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్​కు చెందిన వారు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.

80 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులు..

DU recruitment 2022 : ఢిల్లీ యునివర్సిటీకి చెందిన శ్రీరామ్​ కాలేజ్​ ఆఫ్​ కామర్స్​లో 80 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులకు నోటిఫికేషన్​ వచ్చింది. దరఖాస్తుకు 2023 జనవరి 9 చివరి తేది. అభ్యర్థులు.. colrec.uod.ac.in లో అప్లికేషన్​ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

అప్లికేషన్​ ఫీజు-

అప్లికేషన్​ ఫీజు కోసం అన్​రిజర్వ్​డ్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థలు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

DU recruitment 2022 for assistant professors : ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఎలాంటి రుసుము లేదు.

అప్లై చేసుకోండి ఇలా..

స్టెప్​ 1:- colrec.uod.ac.in వెబ్​సైట్​కు వెళ్లండి

స్టెప్​ 2:- సైన్​ ఇన్​ చేసి అప్లికేషన్​ ఫామ్​ను నింపండి

స్టెప్​ 3:- అప్లికేషన్​ ఫీజు కట్టిండి

స్టెప్​ 4:- అప్లికేషన్​ ఫామ్​ను సబ్మీట్​ చేయండి

స్టెప్​ 1:- భవిష్యత్తు కార్యకలాపాల కోసం ప్రింటౌట్​ తీసుకోండి.

* శ్రీరామ్​ కాలేజ్​ ఆఫ్​ కామర్స్​ పూర్తి నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

* శ్రీరామ్ కాలేజ్​ ఆఫ్​ కామర్స్​, జేఎంసీ ఆర్హత, సెలక్షన్​ ప్రక్రియ ఒకే విధంగా ఉన్నాయి.​

IPL_Entry_Point

సంబంధిత కథనం