Doordarshan new logo : కాషాయం రంగులో దూరదర్శన్ కొత్త లోగో.. సర్వత్రా విమర్శలు!
Doordarshan new logo : దూరదర్శన్ లోగో మార్పుపై వివాదం నెలకొంది. కాషాయం రంగులో లోగోను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Doordarshan logo changed : ప్రముఖ ఆటోనోమస్ పబ్లిక్ టీవీ బ్రాడ్‌క్యాస్టర్ దూరదర్శన్ ఆవిష్కరించిన కొత్త లోగోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోగోను.. ఎరుపు రంగు నుంచి కాషాయం రంగులోకి మార్చడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. విపక్ష పార్టీలు.. దూరదర్శన్ చర్యలపై మండిపడుతున్నాయి.
దూరదర్శన్ కొత్త లోగోపై వివాదం..
దూరదర్శన్‌కి చెందిన ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ డీడీ న్యూస్.. కొత్త లోగోను ఇటీవలే ఆవిష్కరించింది.
"మా విలువలను అలాగే ఉంచుతూ.. మేము కొత్త అవతారంలో మీ ముందుకు వస్తున్నాము. మునుపెన్నడూ లేని విధంగా.. ఓ కొత్త ప్రయాణానికి సిద్ధం అవ్వండి. సరికొత్త డీడీ న్యూస్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేయండి," అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది డీడీ న్యూస్.
Doordarshan logo color : సరిగ్గా ఎన్నికల సమయంలో దూరదర్శన్.. తన లోగోను మార్చడం, పైగా అది కాషాయం రంగులో ఉండటం ఇప్పుడు చర్చలకు దారి తీసింది. చాలా మంది దూరదర్శన్‌ని విమర్శిస్తున్నారు. దూరదర్శన్ మాతృ సంస్థకు గతంలో బాస్‌గా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవ్హర్ సిర్కార్.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
"చారిత్రక లోగోను.. కాషాయం రంగులోకి మార్చేసింది ఈ జాతీయ బ్రాడ్‌క్యాస్టర్ దూరదర్శన్. దూరదర్శన్ కాషాయమయం అవుతుండటం చూసి, ఒక మాజీ సీఈఓగా నాకు బాధ కలుగుతోంది. ఆందోళన కలుగుతోంది. ప్రసార భారతి.. ఇప్పుడు ఏమాత్రం ప్రసార భారతి కాదు. అదొక ప్రచార్ భారతి," అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టీఎంసీ ఎంపీ సిర్కార్.
ప్రసార భారతికి సీఈఓగా.. 2012 నుంచి 2106 వరకు పనిచేశారు సిర్కార్. దూరదర్శన్‌తో పాటు ఆల్ ఇండియా రేడియోను పర్యవేక్షించే సంస్థ.. ఈ ప్రసార భారతి.
Doordarshan logo old : "బ్రాండింగ్ కోసం.. దూరదర్శన్ కాషాయపు రంగునే ఎంచుకోవడం సరైనది కాదు. ఇది ఎన్నికల సమయం. దూరదర్శన్ చేసిన పని.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి విరుద్ధం," అని సిర్కార్ చెప్పుకొచ్చారు.
అయితే.. దూరదర్శన్ కొత్త లోగోను వెనకేసుకొచ్చారు.. ప్రసార భారతి ప్రస్తుత సీఈఓ గౌరవ్ ద్వివేది.
Doordarshan latest news : "విజువల్‌గా ఆకర్షణగా ఉంటుందనే ఈ రంగును ఎంచుకున్నాము. లోగో ఒక్కటే కాదు.. ఛానెల్ లుక్స్,ఫీల్ కూడా అప్‌గ్రేడ్ అయ్యాయి. లైటింగ్, ఎక్విప్మెంట్ కూడా మారాయి," అని చెప్పుకొచ్చారు గౌరవ్ ద్వివేది.
సంబంధిత కథనం
టాపిక్