Donald Trump : పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని సూచన-donald trump phone call to russia president putin advises him not escalate ukraine war ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump : పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని సూచన

Donald Trump : పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని సూచన

Anand Sai HT Telugu

Donald Trump Dials Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధం ముగించాలని సూచించారు.

డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ (AFP)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్నారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు తీసుకోనున్నారు. రిజల్ తర్వాత పలువురు దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడుతున్నారు. తాజాగా రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ఈ సందర్భంగా సూచించారు.

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్ నుండి ఫోన్ కాల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఐరోపాలో యూఎస్ సైనిక ఉనికిని పుతిన్‌కు గుర్తు చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పరిష్కరించేందుకు తదుపరి చర్చలపై కూడా ట్రంప్ ఆసక్తిని వ్యక్తం చేశారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ సమస్యపై భవిష్యత్తులో చర్చలు జరపడానికి సుముఖత వ్యక్తం చేశారు ట్రంప్.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కూడా ట్రంప్ కాల్ చేసి మాట్లాడారు. ఆ సమయంలో కూడా ఈ సంభాషణ వచ్చింది. ఇందులో టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా ఉన్నారు. ట్రంప్ ఫోన్ కాల్ తర్వాత ఈ విషయాన్ని అద్భుతమైనది అని అభివర్ణించారు.

రష్యా ఉక్రెయిన్ వివాదం రెండున్నర సంవత్సరాలుగా రగులుతోంది. ఇది ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలక సమస్యగా మిగిలిపోయింది. ఉక్రెయిన్ రష్యా భూభాగంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌లో పురోగతిని సాధించాయి. ఈ వారాంతంలో రెండు వైపుల నుండి ఇప్పటివరకు అతిపెద్ద డ్రోన్ దాడులు జరిగాయి.

రష్యా రాత్రిపూట ఉక్రెయిన్‌పై 145 డ్రోన్‌లను పేల్చిందని జెలెన్స్కీ చెప్పారు. ఆదివారం మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 34 ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా తెలిపింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.