Donald Trump arrested : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
Donald Trump arrested : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. 20 నిమిషాల ప్రక్రియ అనంతరం విడుదలయ్యారు.
Donald Trump arrested : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా.. ఆట్లాంటా పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మగ్ షాట్ తీశారు..!
డొనాల్డ్ ట్రంప్ జైలులో 20 నిమిషాల పాటు గడిపారు. ఆ సమయంలో ఆయన ఫొటోలు (మగ్ షాట్) తీసుకున్నారు అధికారులు. అనంతరం 2లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదలై.. న్యూ జెర్సీకి వెళ్లేందుకు విమానం ఎక్కారు.
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఆట్లాంటాకు వెళ్లారు ట్రంప్. ట్రాఫిక్ మధ్యలో జైలుకు చేరుకున్నారు. అరెస్ట్, విడుదలకు సంబంధించిన ప్రక్రియ 20 నిమిషాల్లో ముగిసింది. ఈ క్రమంలో ట్రంప్‌నకు సంబంధించి పలు వివరాలు తీసుకున్నారు పోలీసులు. ఆయన ఎత్తు 6 అడుగుల 3 ఇంచ్‌లు, ఆయన బరువు 215 పౌండ్లుగా నమోదు చేసుకున్నారు. ఆయనకు స్ట్రాబెరీ/ బ్లాండ్ హెయిర్ ఉన్నట్టు రికార్డుల్లో రాసుకున్నారు. ట్రంప్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా అట్లాంటా జైలుకు.. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
2024 అధ్యక్ష ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే నాలుగు నగరాల్లో ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. వీటిల్లోని కొన్నింట్లో ఆయన దోషిగా కూడా తేలారు. అమెరికా మాజీ అధ్యక్షుడు.. ఈ ఏడాది మార్చ్ నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఫ్లోరిడా, వాషింగ్టన్లో ఫెడరల్ ఛార్జీలు ఎదుర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ఈ నెల తొలినాళ్లల్లో దోషిగా తేలారు. ఆయనతో పాటు మాజీ చీఫ్ ఆఫ్ స్టాప్ మార్క్ మిడోస్, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియానిలు కూడా దోషులుగా తేలారు.
ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ.. తనని తాను వెనకేసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రభుత్వం తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశ చరిత్రలో తన అరెస్ట్.. ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం