ఇక విమానాల నుంచి ఐఎండీకి వాతావరణ సమచారం.. మరికొన్ని రోజుల్లో అమల్లోకి!
Weather Update From Flights : విమానాల నుంచి వాతావరణ సమాచారాన్ని సేకరించేందుకు ఐఎండీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సరికొత్త ప్రణాళికతో ముందుకురానుంది. ఈ మేరకు అన్ని విమానాలు డేటా పంచుకునేలా చర్యలు తీసుకోనుంది.
స్వదేశీ విమానాల నుంచి వాతావారణ సమాచాన్ని సేకరించాలని వాతావరణ శాఖ భావిస్తోంది. విమానాలు వెదర్ డేటాను కచ్చితంగా పంచుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం అనుకుంటోంది. ఈ మేరకు చర్చలు జరుగుతునున్నాయి. కచ్చితమైన సమాచారాన్ని అంచనా వేసేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. ఎందుకంటే టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో విమానాలు కచ్చితమైన వాతావరణ సమాచారంతో వెళ్తాయి. ఈ సమాచారాన్ని పంచుకుంటే సరైన ఫలితం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. దీంతో ఐఎండీ మరింత కచ్చితత్వంతో ముందస్తు వాతావరణ అంచనా వేయడం ఈజీగా అవుతుంది.
ఈ మేరకు దేశీయ విమానయాన సంస్థలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానం సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఐఎండీతో పంచుకోవడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అంచనా సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయి.
సరైన అంచనా
'ఒక సంవత్సరంలో దేశీయ విమానయాన సంస్థలకు వాతావరణ సమాచారం పంచుకోవడం తప్పనిసరి అవుతుంది. ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలకు మాత్రమే కాకుండా అన్ని చోట్లా వాతావరణ సూచనలకూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సేకరించిన సమాచారంతో కచ్చితమైన అంచనా వేసేందుకు వీలుగా ఉంటుంది. ఎక్కువ పరిశీలనలు ఉంటే అంచనాలు మెరుగ్గా ఉంటాయి. ఇది ఎగ్జిట్ పోల్‌ను పోలి ఉంటుంది. ఎక్కువ ప్రదేశాల నుండి డేటాను సేకరిస్తే స్పష్టమైన అంచనా వేయవచ్చు.' అని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఎం.రవిచంద్రన్ చెప్పారు.
పైన పరిస్థితులు
భూమిపై పరిశీలనల కంటే విమానం, వాతావరణ బెలూన్ల నుండి పొందడం చాలా ముఖ్యమైనవి అని రవిచంద్రన్ అన్నారు. ఎందుకంటే అవి పైన ఏం జరుగుతుందో మాత్రమే కాకుండా వాతావరణం పూర్తి సమాచారాన్ని అందిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. తుపానులు వంటి సమయంలో వివిధ ఎత్తులలో ఉష్ణోగ్రత, తేమ, గాలి పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
రియల్‌టైమ్ డేటా
విమానంలో అమర్చిన సెన్సార్‌లు, పరికరాలను ఉపయోగించి ఎయిర్‌క్రాఫ్ట్ వాతావరణ పరిశీలనలను అందజేస్తుంది. ఇవి సాధారణంగా ఆన్‌బోర్డ్ సిస్టమ్‌లలో భాగంగా ఉంటాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో వాతావరణ డేటాను కూడా రికార్డ్ చేస్తుంది. ఈ డేటా రియల్‌టైమ్‌లో భూమికి ప్రసారం అవుతుంది. ఇక్కడ ఐఎండీ అంచనాలతో వీటిని కలిపి చూస్తారు.
ఇది అవసరమే
అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలు వాతావరణ డేటాను అందించాయని, ఎందుకంటే ఇది చట్టం ప్రకారం అవసరం అని రవిచంద్రన్ చెప్పారు. అయితే అన్ని దేశీయ విమానయాన సంస్థలకు ఇది తప్పనిసరి కాదు కాబట్టి అలా చేయట్లేదన్నారు. చాలా దేశాలు తమ విమానయాన సంస్థలు వెదర్ డేటాను అందించడాన్ని తప్పనిసరి చేశాయని, భారత్‌లో కూడా ఇలాంటి విధానం కలిగి ఉండాలని రవిచంద్రన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం