Dollar rate today: 9 పైసలు బలపడి 79.81కి చేరుకున్న రూపాయి విలువ-dollar rate today rupee rises 9 paise to 79 81 against us dollar in early trade ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Dollar Rate Today Rupee Rises 9 Paise To 79.81 Against Us Dollar In Early Trade

Dollar rate today: 9 పైసలు బలపడి 79.81కి చేరుకున్న రూపాయి విలువ

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 10:27 AM IST

Dollar rate today: రూపాయి విలువ 9 పైసల మేర బలపడి డాలరుతో పోల్చితే 79.81కి చేరుకుంది.

Dollar rate today: ఆరంభ ట్రేడింగ్‌లో 9 పైసల మేర బలపడ్డ రూపాయి
Dollar rate today: ఆరంభ ట్రేడింగ్‌లో 9 పైసల మేర బలపడ్డ రూపాయి (PTI)

ముంబయి, జూలై 25: ముడి చమురు ధరల పతనం కారణంగా సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి 79.81కి చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద అమెరికన్ డాలర్‌తో రూపాయి 79.86 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే గరిష్టంగా 79.81కి, కనిష్ట స్థాయి 79.87కి చేరుకుంది.

క్రితం సెషన్‌లో అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ 79.90 వద్ద ముగిసింది.

ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.10 శాతం పడిపోయి 106.62 వద్దకు చేరుకుంది.

గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.54 శాతం తగ్గి 102.62 డాలర్లకు చేరుకుంది.

డాలర్ ఇండెక్స్‌ బలహీనపడడం, చమురు క్షీణించడంతో రూపాయి పెరిగిందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ట్రెజరీ హెడ్ అనిల్ కుమార్ భన్సాలీ చెప్పారు.

జూలై 27న జరిగే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం నుండి మార్కెట్ తగిన సంకేతాల కోసం ఎదురుచూస్తున్నందున యూరో పెద్దగా పెరగలేకపోయింది.

రూపాయి 79.60 నుండి 79.90 మధ్య రేంజ్‌లో కదులుతుందని భన్సాలీ అంచనా వేశారు.

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 30-షేర్ సెన్సెక్స్ ఉదయం 10.23 సమయంలో 386 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయింది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ. 675.45 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్