187 Coins in Man stomach: ఓ వ్యక్తి కడుపులో ఏకంగా 187 నాణేలు.. షాకైన డాక్టర్లు-doctors recover 187 coins from mans stomach in karnataka ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Doctors Recover 187 Coins From Mans Stomach In Karnataka

187 Coins in Man stomach: ఓ వ్యక్తి కడుపులో ఏకంగా 187 నాణేలు.. షాకైన డాక్టర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2022 10:51 AM IST

187 Coins in Man stomach: కడుపు నొప్పి అంటూ ఓ వ్యక్తి.. డాక్టర్ల వద్దకు వచ్చాడు. ఆయనకు ఎక్స్‌రే చేసిన వైద్యులు షాకయ్యారు. కడుపులో కుప్పలుగా నాణేలు ఉన్నట్టు గుర్తించారు.

187 Coins in Man stomach: ఓ వ్యక్తి కడుపులో ఏకంగా 187 నాణేలు.. షాకైన డాక్టర్లు
187 Coins in Man stomach: ఓ వ్యక్తి కడుపులో ఏకంగా 187 నాణేలు.. షాకైన డాక్టర్లు (HT_Photo)

187 Coins in Man stomach: పొరపాటుగా కడుపులోకి ఏదైనా చిన్న వస్తువు పోయినా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే నాణేం (Coin) మింగితే ఇక అంతే. బయటికి వచ్చే వరకు కష్టంగా ఉంటుంది. అయితే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 182 నాణేలను మింగాడు. కొంతకాలం పాటు అన్నింటిని కడుపులోనే మోశాడు. రూ.5, రూ.2, రూ.1 కాయిన్లను మింగాడు. అయితే తన కడుపులో కాయిన్స్ ఉన్నట్టు అతడి గుర్తు కూడా లేదట. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

కడుపు నొప్పి అని రాగా..

187 Coins in Man stomach: కడుపులో తీవ్రమైన నొప్పి ఉందని, వాంతులతో బాధపడుతున్నానంటూ రాయచూర్ జిల్లా లింగసూర్‍కు చెందిన 58 సంవత్సరాల ద్యామప్ప హరిజన్ అనే వ్యక్తి.. డాక్టర్ల వద్దకు వచ్చాడు. అప్పుడు డాక్టర్లు ఆయనకు ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఆ తర్వాత షాకయ్యారు. ఆయన కడుపులో కుప్పలుగా నాణేలను ఉండటం గుర్తించారు. ఆయన కడుపులో రూ.5 కాయిన్లు 56, రూ.2 నాణేలు 51, రూపాయి బిళ్లలు 80 ఉన్నాయి. వీటి మొత్తంగా విలువ రూ.462. ఈ నాణేల బరువు సుమారు 1.5కేజీలుగా ఉంది. స్కిజోఫ్రెనియా అనే మానసిక రుగ్మతతో ఆ వ్యక్తి బాధపడుతున్నాడని డాక్టర్లు వెల్లడించారు. రెండు, మూడు నెలల వ్యవధిలోనే ఆయన ఈ నాణేలను మింగాడని వెల్లడించారు.

కర్ణాటక బాగల్‍కోట్‍లోని హనగల్ శ్రీ కుమారేశ్వరన్ ఆసుపత్రిలో శనివారం వైద్యులు ఆపరేషన్ చేసి.. ద్యామప్ప కడుపులో నుంచి 187 నాణేలను బయటికి తీశారు.

రెండు గంటల పాటు సర్జరీ

187 Coins in Man stomach: రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి ఆయన కడుపులోని నాణేలను బయటికి తీసినట్టు వైద్యులు తెలిపారు. “ఆయన కడుపు విపరీతంగా ఉబ్బిపోయింది. కడుపులోని వివిధ ప్రదేశాల్లో నాణేలు ఇరుక్కుపోయాయి. రెండు గంటల పాటు సర్జరీ చేసి, నాణేలను తీశాం. శస్త్రచికిత్స తర్వాత వాటర్ డెఫిసియన్సీ లాంటి చిన్న సమస్యలకు చికిత్స చేశాం. ప్రస్తుతం రోగి పరిస్థితి చాలా స్థిరంగా ఉంది. ఆయన మాట్లాడగలుగుతున్నారు” అని శస్త్రచికిత్స చేసిన వైద్య బృందంలోని డాక్టర్ ఈశ్వర్ కలబురిగి చెప్పారు.

స్క్రిజఫెనియాతో బాధపడే వారు.. లేనిది ఊహించుకోవడం, భయానికి లోనవడం, అస్తవ్యస్థమైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారో కూడా గుర్తుంచుకోలేరు.

IPL_Entry_Point

టాపిక్