Rajnikanth : ‘అన్ని పళ్లు ఊడిపోయినా.. ఇంకా సినిమాలు చేస్తున్నారు’- రజినీకాంత్​కి మంత్రి కౌంటర్​!-dmk leader attacks rajnikanth over old guards remark says this ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajnikanth : ‘అన్ని పళ్లు ఊడిపోయినా.. ఇంకా సినిమాలు చేస్తున్నారు’- రజినీకాంత్​కి మంత్రి కౌంటర్​!

Rajnikanth : ‘అన్ని పళ్లు ఊడిపోయినా.. ఇంకా సినిమాలు చేస్తున్నారు’- రజినీకాంత్​కి మంత్రి కౌంటర్​!

Sharath Chitturi HT Telugu
Aug 26, 2024 08:28 AM IST

Rajnikanth vs Durai Murugan : రజినీకాంత్​పై సెటైర్లు వేశారు డీఎంకే మంత్రి. సీనియర్​ నటులు ఇంకా సినిమాలు చేస్తుండటంతో జూనియర్ నటులకు అవకాశాలు రావడం లేదని అన్నారు. అసలు ఏం జరిగిందంటే..

రజినీకాంత్​పై మంత్రి సెటైర్లు!
రజినీకాంత్​పై మంత్రి సెటైర్లు!

సూపర్​స్టార్​ రజినీకాంత్​పై డీఎంకే మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తలకెక్కాయి. 'గడ్డాలు పెరిగిపోయి, అన్ని పళ్లు ఊడిపోయినా, సీనియర్​ నటులు ఇంకా పాత్రలు పోషిస్తుండటంతో జూనియర్లకు అవకాశాలు రావడం లేదు,' అని రజినీకాంత్​ని పరోక్షంగా విమర్శించారు డీఎంకే నేత, సీనియర్​ లీడర్​ దురై మురుగన్​. రజినీకాంత్​ తనపై అన్న మాటలకు ఈ విధంగా కౌంటర్​ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే..

ఇదీ జరిగింది..

తమిళనాడు మాజీ సీఎం ఎం కరుణానిథిపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఎంకే స్టాలిన్​ ఇటీవలే ఆవిష్కరించారు. ఈ ఈవెంట్​లో పాల్గొన్న రజినీకాంత్​.. డీఎంకే సీనియర్​ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

"నా ప్రియమైన స్నేహితుడు స్టాలిన్​ సీఎం అయ్యాక, డీఎంకే పార్టీలో విజయాల పరంపర కొనసాగుతోంది. అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తోంది. ఆయన నాయకత్వానికి, కష్టానికి, రాజకీయ జ్ఞానానికి ఇది నిదర్శనం. అధినేత మరణం తర్వాత ముందుకు వెళ్లలేక డీలాపడిన ఎన్నో రాజకీయ పార్టీలను చూశాము. పార్టీని నడిపించేందుకు చాలా మంది విఫలం అయ్యారు. ఇది ఇతర రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ, స్టాలిన్​ డీఎంకేని బాగా నడిపిస్తున్నారు. అన్నీ తానై ముందుండి చూసుకుంటున్నారు. అయితే.. ఓ స్కూల్​ టీచర్​కి (స్టాలిన్​) కొత్త విద్యార్థులతో ఎలాంటి సమస్య ఉండదు. సమస్యంతా పాత విద్యార్థుల (సీనియర్​ లీడర్లు)తోనే ఉంటుంది! వారిని హ్యాండిల్​ చేయడం అంత సులభం కాదు. ఇక్కడ (డీఎంకే) చాలా మంది పాత విద్యార్థులు ఉన్నారు. వారు సాధారణ స్టూడెంట్స్​ కాదు. అందరు ర్యాంక్​ హోల్డర్లు. వారిని ఎలా మేనేజ్​ చేయాలి? మరీ ముఖ్యంగా దురై మురుగన్​ లాంటి వారిని ఎలా మేనేజ్​ చేయాలి? స్టాలిన్​ సర్​, హ్యాట్స్​ ఆఫ్​!" అని రజినీకాంత్​ వ్యాఖ్యానించారు.

రజినీకాంత్​ మాటలను దురై మురుగన్​ చాలా సీరియస్​గా తీసుకున్నారు. ఆయన ఘాటుగానే స్పందించారు. సినీ పరిశ్రమను రాజకీయాలతో పోల్చి, రజినీకాంత్​పై పరోక్షంగా సెటైర్లు విసిరారు.

"సినీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి! సీనియర్​ నటలు ఇంకా సినిమాలు చేస్తుండటంతో యువ నటులకు అవకాశాలు లభించడం లేదు. అన్ని పళ్లు ఊడిపోయిన తర్వాత కూడా సీనియర్లు నటిస్తున్నారు," అని దురై మురుగన్​ అన్నారు.

దురై మురుగన్​ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాయి. ఆయన రజినీకాంత్​నే అన్నారు అని పలువురు భావిస్తున్నారు.

సంబంధిత కథనం